IPL Auction 2024: ఈరోజు ఐపిఎల్ మినీ ఆక్షన్ దుబాయ్ లోని కోకా కోలా ఎరెనా వేదికగా నిర్వహిస్తున్నారు.ఇక ఇందులో ప్లేయర్లు భారీ ధరకు అమ్ముడుపోతున్నారు. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్లు అయితే కోట్లు కొల్లగొడుతున్నారు…ఇక ఇది ఇలా ఉంటే మొదటి సారి ఐపిఎల్ వేలం లో ఆక్షనీర్ గా మహిళ గొంతు వినిపించింది. ఇక ఆమెని చూసిన చాలా మంది ఎవరు ఆమె అని నెట్లో భారీ ఎత్తున ఆమె గురించి వెతుకుతున్నారు…
ఇక ఈమె పేరు మల్లికా సాగర్…ఈమె అంతకు ముందు మహిళ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్)కి వేలం నిర్వాహకురాలు గా వ్యవహరించింది.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన వేలంలో ఆమె ఆక్షనీర్ గా వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకోవడంతో ఇప్పుడు జరుగుతున్న ఐపిఎల్ మినీ వేలానికి కూడా ఆమెనే అక్షనీర్ గా తీసుకోవడం విశేషం…ఇక ఐపిఎల్ లో అక్షనీర్ గా ఇప్పటి వరకు హ్యుగ్ ఎడ్మిడ్స్, రిచర్డ్ మ్యడ్లి, చారు శర్మ లాంటి వారు వ్యవహరించారు…కానీ ఫస్ట్ టైమ్ మల్లికా సాగర్ వ్యవహరించారు…
మల్లికా సాగర్ ముంబై కి చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్…ఈమె ఇంతకు ముందు ఆధునిక, సమకాలీన భారత కళాకృతుల కన్సల్టెంట్ గా పని చేశారు…ఇక ఈమె 2001 వ సంవత్సరం లో న్యూయార్క్ లో మొదటి సారి మోడ్రన్ ఆర్ట్ వేలం నిర్వహించారు దాంట్లో మొదటి సారి ఆక్షనీర్ గా వ్యవహరించింది…దాంతో ఆమెకి మంచి పేరు తో పాటు ప్రముఖుల నుంచి కూడా ప్రశంశలు దక్కాయి…
మొదటగా ఈమె 2021 లో ప్రో కబడ్డి లీగ్ కి వేలం ప్రక్రియ నిర్వహించి మంచి ప్రశంసలను అందుకుంది.ఇక దాంతో ఆమె మహిళ ప్రీమియర్ లీగ్ కి ఆక్షనీర్ గా వ్యవహరించింది. ఇక ఇప్పుడు ఇలా ఐపిఎల్ కి వ్యవహరిస్తుంది…ఎక్కడో స్టార్ట్ అయిన ఆమె ప్రస్థానం ప్రస్తుతం ఐపిఎల్ వేలానికి అక్షనీర్ గా వ్యవహరించే వరకు సాగింది..
ఇక ప్రస్తుతం ఐపిఎల్ అభిమానులు అందరూ కూడా ఆక్షనీర్ గా ఆమె వ్యవహరిస్తున్న తీరుకి ఆమెకి పెద్ద ఫ్యాన్స్ అవుతున్నారు…ఇక ఈ క్రమం లోనే ఇప్పటికే ఆమె మీద సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రశంశల వర్షం కురుస్తుంది… ఇక ఇప్పటికే చాలా మంది అభిమానులను సంపాదించుకున్న మల్లికా ఇక మీదట కూడా తన టాలెంట్ తో మరింత ముందుకెళ్లాలని కోరుకుందాం…