IPL Auction 2024 – Sameer Rajvi : ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు దుబాయ్ వేదికగా మినీ వేలాన్ని నిర్వహించారు.ఇక అందులో భాగం గానే ఆస్ట్రేలియాకి చెందిన ఇద్దరు స్టార్. ప్లేయర్లు 20 కోట్లకు పైన డబ్బులను కొల్లగొట్టి తమదైన రీతిలో వాళ్ల సత్తాని చాటారు ఇక దానికి ఏ మాత్రం తగ్గకుండా ఇండియన్ ప్లేయర్లు కూడా తమ సత్తా చాటుతూ ఐపీఎల్ లోకి ముందుకు దూసుకొస్తున్నారు. ఇక ముఖ్యంగా అన్ క్యాప్డ్ ప్లేయర్ అయిన సమీర్ రజ్వీ తనదైన రీతిలో కోట్లు కొల్లగొట్టాడు. క్యప్డ్ ప్లేయర్లు సైతం దక్కించుకోలేని ఒక అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు…
ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఈ కుర్ర ప్లేయర్ ని ఏకంగా 8 కోట్ల 40 లక్షల చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. క్యాప్డ్ ప్లేయర్లకు కూడా సాధ్యం కాని రేంజ్ లో ఈయనకి ఇంత మొత్తాన్ని చెల్లించడం పైన క్రికెట్ మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక దీంతో చెన్నై అభిమానులు నెట్లో అతని గురించి విపరీతమైన సెర్చింగ్ చేస్తున్నారు… ధోని సారథ్యంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక యంగ్ ప్లేయర్ పైన ఇంత మొత్తాన్ని పెట్టడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ ప్లేయర్ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం ఇతని పైన అంత మొత్తాన్ని పెట్టడంలో తప్పులేదనిపిస్తుంది.
ఉత్తరప్రదేశ్ టి20 లీగ్ మ్యాచ్ ల్లో ఈయన 3 సెంచరీలు చేసి తన సత్తా చాటుకున్నాడు.అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఆయనకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి.అందుకే ప్రతి టీం కూడా అతన్ని తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఛాన్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ టీం కి వరించింది… ఇక యంగ్ ప్లేయర్లని ఎంకరేజ్ చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడానికి మరొకసారి సమీర్ రజ్విని ఉదాహరణగా తీసుకోవచ్చు.. ఇక ఇప్పటికే ఇండియన్ ప్లేయర్ అయిన అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ టీం నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇండియన్ ప్లేయర్ ప్లేస్ ఒకటి ఖాళీ అయింది.
ఇక అందులో భాగంగానే సమీర్ రజ్వీని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాయుడుకి రీప్లేస్ గా రహానే లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ సమీర్ రజ్విపైన ధోని ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. సమీర్ రజ్వీ ని తీసుకొమ్మని ధోని ముందే వాళ్ల యాజమాన్యానికి చెప్పినట్టు గా తెలుస్తుంది. ఈయనని తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అంటే యంగ్ ప్లేయర్లు టీం లో ఉంటే వాళ్ళు ఎక్కువ రోజులు పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీం వైపు ఆడతారు కాబట్టి ధోని యంగ్ ప్లేయర్లను తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాడు… ఇక అందులో భాగంగానే న్యూజిలాండ్ ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర ని కూడా ఒక కోటి 80 లక్షల కి కొనుగోలు చేశారు…