Salaar: సలార్ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. డిసెంబర్ 21 రాత్రే యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుంది. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు ట్రైలర్స్ విడుదల చేశారు. ఒకదాన్ని మించి మరొకటి ఉంది. ఖాన్సార్ అనే ఒక కల్పిత రాజ్యాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్ దాని మీద ఆధిపత్య పోరు ఎవరిదనే కోణంలో తెరకెక్కించాడని తెలుస్తుంది. ఇక సినిమా కోర్ పాయింట్ ఇద్దరు మిత్రుల స్నేహం. వారిలో ఒకడైన దేవ మిత్రుడు కోసం ఎంతకైనా తెగిస్తాడు.
సలార్ మూవీని కొందరు ప్ ప్రముఖులు ఇప్పటికే వీక్షించారు. బ్లాక్ బస్టర్ ఆన్ ది వే అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. యూఎస్ ప్రీమియర్ బుకింగ్ కలెక్షన్స్ వన్ మిలియన్ దాటేశాయి. ఇండియాలో ఇప్పుడిప్పుడే బుకింగ్స్ మొదలయ్యాయి. సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి. ఒక అంచనా ప్రకారం సలార్ మూవీ ఫస్ట్ డే రూ. 100 నుండి 150 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబడుతుందట. ఫస్ట్ వీకెండ్ కి సలార్ వసూళ్లు రూ. 500 కోట్ల మార్క్ దాటవచ్చు.
మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రూ. 1000 నుండి 1200 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టడం ఈజీ అంటున్నారు. మరి చూడాలి ఈ అంచనాలను సలార్ ఏ మేరకు అందుకుంటుందో. అయితే షారుఖ్ ఖాన్ డంకీ నుండి సలార్ కి గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా నార్త్ లో సలార్ వసూళ్లపై డంకీ ప్రభావం ఉంటుంది. థియేటర్స్, షోస్ ఆశించిన స్థాయిలో లభించకపోవచ్చు. అందులోనూ షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. అలాగే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి ఇంత వరకు అపజయం లేదు.
సలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్-పృథ్విరాజ్ స్నేహితులుగా కనిపిస్తారు. పార్ట్ 2లో వీరిద్దరి మధ్యే అసలైన యుద్ధం జరుగుతుంది. ప్రాణమిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారనేది కథలు అసలు ట్విస్ట్. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావు, టిను ఆనంద్ కీలక రోల్స్ చేస్తున్నారు. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ సలార్ విడుదల కానుంది.