Kuldeep Yadav Vanshika: టీమ్ ఇండియాలో మరో ఆటగాడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల రింకు సింగ్ తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఆమె మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో మరో ఆటగాడు కూడా చేరిపోయాడు. అతడు కూడా తన కాబోయే భార్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే ఆమెతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దానికంటే ముందుగా తనకు కాబోయే సతీమణితో ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి.
Also Read: అజిత్ దోవల్ చాతుర్యం: సిక్కింను భారత్‌లో కలిపిన ఓ గూఢచారి గాథ
టీమిండియాలో చైనా మన్ గా పేరు పొందాడు కులదీప్ యాదవ్. మిస్టరీ స్పిన్ బౌలింగ్ తో అదరగొట్టే ఈ ఆటగాడు.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కొంతకాలంగా వన్శీకతో అతడు ప్రేమలో ఉన్నాడు. ఇటీవల తన బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అతడు నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.. బ్లాక్ సూట్ లో కులదీప్ మెరిసిపోతున్నాడు. తెలుపు రంగు ధరించిన వన్శీక దేవకన్య లాగా కనిపిస్తోంది. ఈ జంట చూడముచ్చటగా ఉంది..
కులదీప్ వన్శీక కు జూన్ నాలుగున ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఏడాది చివర్లో వివాహం జరిగే అవకాశం కల్పిస్తోంది.. కులదీప్ కు రాబోయే సతీమణి స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో. ఈమె ఎల్ఐసి లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. కులదీప్, వన్శీక కు చిన్నప్పటినుంచి స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ఇటీవల ప్రేమగా మారింది.. దీంతో వారిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని భావించారు. దానికి తగ్గట్టుగానే ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. త్వరలో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో కులదీప్ పై శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది.. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. ఇక వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ లో కులదీప్ యాదవ్ కు చోటు లభించింది. గడచిన టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన కులదీప్ యాదవ్.. ఆసియా కప్ లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే మైదానంలో కసరత్తు చేస్తున్నాడు.