Ajit Doval Sikkim Merger: జేమ్స్ బాండ్ సినిమాలు చూశారా.. అందులో హీరో చాకచక్యంగా ఆపరేషన్లు సాగిస్తుంటాడు. శత్రువులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటాడు. క్లిష్టమైన ఆపరేషన్లు అత్యంత సులువుగా చేస్తూ.. శత్రువులను సంహరిస్తూ ఉంటాడు. అదంటే సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది.. పైగా కథానాయకుడు అంతిమంగా హీరో కావాలి కాబట్టి.. సన్నివేశాలు అలా సాగిపోతుంటాయి. కానీ నిజ జీవితంలో అలా అవుతుందా.. అలా జరగడానికి ఆస్కారం ఉంటుందా.. కచ్చితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అజిత్ రూపంలో సజీవమైన సాక్ష్యం మనకు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది.
గూఢచారి నవల మాదిరిగా..
అజిత్ దోవల్ జీవితాన్ని చూస్తూ ఉంటే అది ఒక గూఢచారి నవల మాదిరిగా ఉంటుంది.. ఆయన పాకిస్తాన్, చైనా దేశాలలో గూఢచారి గా వ్యవహరించారు. క్లిష్టమైన మిషన్లలో పాల్గొన్నారు. ఆయన చేసిన మిషన్లలో అత్యంత ముఖ్యమైనది “సిక్కిం”.. సిక్కిం అనేది హిమాలయ ప్రాంతాలలో ఉంటే చిన్న రాష్ట్రం. ఇది డ్రాగన్ దేశానికి సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో మంగోలియన్ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. 1970 కాలంలో సిక్కిం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. అక్కడి మహారాణిగా హోప్ కుక్ అనే మహిళ ఉండేవారు. ఆమె అమెరికన్ మూలాలు ఉన్న మహిళ. ఆమెకు సీఐఏ తో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో భారత్ – అమెరికా మధ్య అంతగా సంబంధాలు ఉండేవి కాదు. దీంతో సిక్కింపై అమెరికా పెత్తనం పెరిగిపోయింది. ఇది సహజంగానే భారత ప్రభుత్వంలో ఆందోళన కలిగించింది. సిక్కిం రాష్ట్రం 1642 నుంచి చోగ్యాల్ వంశం ఆధీనంలో ఉండేది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సిక్కిం అనేది రక్షిత రాష్ట్రంగా మారిపోయింది. రక్షణ, వ్యవహారాలు భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటే.. అంతర్గత పరిపాలన మాత్రం అక్కడి రాజవంశం చేతుల్లో ఉండేది.. 1965లో పాల్డెన్ తొండప్ నామ్యాల్ రాజుగా వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన మనదేశంలోనే చదువుకున్నప్పటికీ.. 1960లో అమెరికన్ మహిళ హోప్ కుక్ ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సిక్కిం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి.
Also Read: ట్రంప్ కు మూడింది పో.. మోదీ-పుతిన్ లతో జిన్ పింగ్.. ఇక దబిడదిబిడే

రహస్య మహారాణి
కుక్ విదేశీ పత్రికల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మమేకమవుతు ఉండేవారు. అంతేకాదు సిక్కిం రాష్ట్రం భారతదేశ ప్రభుత్వంతో పోరాడుతోంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేసేవారు. తన భర్తను భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడాలని.. సిక్కిం ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించేలా చూడాలని ప్రోత్సహించేది. అయితే ఆమె సాగిస్తున్న వ్యవహారాలను నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి నివేదిస్తూ ఉండేది. ఇక 1971లో బంగ్లాదేశ్ తో యుద్ధం జరుగుతున్నప్పుడు కుక్ అమెరికా, పాకిస్తాన్ దేశాలకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇది మన దేశ పరిపాలకులకు అతిపెద్ద భద్రతా సమస్యగా మారిపోయింది.. అదే సమయంలో అజిత్ దోవల్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో గూఢచారి గా నియమించింది. దీంతో ఆయన అక్కడి ప్రజల్లో కలిసి పోయారు. రాజకీయ నాయకులతో నిత్యం మాట్లాడుతుండేవారు. ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేవారు. ఆయన పంపించిన నివేదిక ప్రకారం సిక్కిం రాష్ట్రంలో నేపాలి వంశస్థులు రాజవంశాన్ని.. కుక్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తేలింది. ఇది అప్పటి పాలకులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. భారత ప్రభుత్వ ప్రోత్సాహంతో 1973లో సిక్కిం లో ప్రజలు ఉద్యమం మొదలుపెట్టారు. తీవ్ర ఒత్తిడికి గురైన కుక్ చివరికి అమెరికా వెళ్ళిపోయారు. 1975లో సిక్కిం రాజ వంశాన్ని రద్దుచేస్తూ.. భారతదేశంలో విలీనం అవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. 97 శాతం మంది ప్రజలు భారత్ లో కలవడానికి తను మద్దతు ప్రకటించారు. తద్వారా భారతదేశంలో 22వ రాష్ట్రంగా సిక్కిం ఆవిర్భవించింది. సిక్కిం రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడానికి అజిత్ కీలకపాత్ర పోషించారు. ప్రజల భావోద్వేగాలను ఆయననిత్యం అంచనా వేశారు. నిశ్శబ్దంగా సిక్కిం రాష్ట్రం భారత్ లో కలిసేలా చేశారు. అంతేకాదు “స్పై క్వీన్” దుష్చర్యను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. ఈ మిషన్ ఆయన గూఢచారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోయింది.
