DC Vs LSG 2024: సాధారణంగా క్రికెట్లో సీమర్లు వేసే బంతుల వేగానికి వికెట్లు ఎగిరిపోతాయి. అప్పుడప్పుడు విరిగిపోతుంటాయి. కానీ స్పిన్ బౌలర్ల బౌలింగ్లో వికెట్ల బెయిల్స్ ఎగిరిపోవడం తప్ప.. ఇంతవరకు విరిగిన దాఖలాలు లేవు. కానీ చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఆ ఘనత సాధించాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన అతడు.. లక్నో జట్టుతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడమే ఆలస్యం.. లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్థి జట్టుకు బలమైన హెచ్చరికలు పంపాడు. ఈ మ్యాచ్లో ప్రమాదకరమైన స్టోయినీస్(8)ను అవుట్ చేసిన కులదీప్.. తర్వాత బంతికి నికోలస్ పూరన్(0) ను గోల్డెన్ డక్ గా వెనక్కి పంపాడు. అనంతరం భారీ స్కోరు దిశగా సాగుతున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) ను అవుట్ చేసి ఢిల్లీ శిబిరంలో ఆనందం నింపాడు. కులదీప్ తీసిన వికెట్లలో పూరన్ ను క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఈ మ్యాచ్ కే హైలెట్.
స్టోయినిస్ అవుట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చాడు పూరన్. కెప్టెన్ రాహుల్ తో కలిసి లక్నో స్కోరు ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న కులదీప్ యాదవ్ అద్భుతమైన గూగ్లీ వేసి పూరన్ ను వెనక్కి పంపించాడు. మధ్య వికెట్ మీదుగా పడిన బంతి పూరన్ చూస్తుండగానే అతడిని దాటేసి వికెట్లను పడగొట్టింది. వాస్తవానికి ఆ బంతిని డిపెండ్ చేయడానికి పూరన్ ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఆ స్థాయిలో టర్న్ అవుతుందని అతడు అనుకోలేదు. దీంతో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఊహించని విధంగా బంతి మలుపు తీసుకొని ఆ సందులో నుంచి దూరిపోయింది. వికెట్లను పడగొట్టింది.. అయితే ఏం జరిగిందో తెలుసుకునే లోపే వికెట్ పడిపోయింది..
బంతి టర్న్ అయిన విధానానికి వికెట్ పడిపోవడమే కాదు విరిగిపోయింది కూడా.. వాస్తవానికి స్పిన్ బౌలింగ్ లో వికెట్లు నేలకూలుతాయి. లేదా వాటి పైన ఉన్న బెయిల్స్ కింద పడతాయి. అయితే అనూహ్యంగా కులదీప్ వేసిన బంతి వికెట్లను పడగొట్టడమే కాదు.. ఒక వికెట్ ను విరగగొట్టింది కూడా. అయితే చాలామంది పూరన్ వికెట్ పడిపోయిందని మాత్రమే అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది అది కాదు.. వికెట్టు పడిపోవడమే కాకుండా విరిగిపోయింది కూడా.. విరిగిన వికెట్ తాలూకూ దృశ్యాన్ని “జియో” అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అయితే దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “కులదీప్ యాదవ్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అద్భుతమైన బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. అన్నిటికంటే ముఖ్యంగా పూరన్ వికెట్ పడగొట్టాడు. అతడు బంతి వేసిన విధానానికి వికెట్ పడిపోవడమే కాదు విరిగిపోయింది.. ఇంకా నయం బ్యాటర్ కు తగలరాని చోట తగలలేదు” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Kuldeep Yadav bamboozled Pooran. ⭐pic.twitter.com/xverP8ciZk
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2024