IPL 2023 : ఆ క్రికెటర్ చెత్త రికార్డు.. కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే గోల్డెన్ డకౌట్..!

ఈ మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగిన పాండ్యా.. తన ఖాతాలో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయిన మూడో క్రికెటర్ గా క్రునాల్ పాండ్యా రికార్డుల్లోకి ఎక్కాడు.

Written By: NARESH, Updated On : May 3, 2023 10:22 pm
Follow us on

IPL 2023 : ఒక జట్టుకు సారధ్యం వహించే అవకాశం అందరికీ దక్కదు. ఒకవేళ సారధ్య బాధ్యతలు దక్కితే మాత్రం అదృష్టంగానే భావించాలి. తమను తాము నిరూపించుకొని.. ఇచ్చిన బాధ్యతలను మరింత బలపరుచుకోవాలి. అతి కొద్ది మంది మాత్రమే ఆ అవకాశాలను చేజార్చుకుంటారు. అదే పని చేశాడు క్రునాల్ పాండ్యా. గాయం కారణంగా లక్నో జట్టుకు దూరమైన కేల్ రాహుల్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి బుధవారం తొలి మ్యాచ్ ఆడాడు పాండ్యా. అయితే కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే గోల్డెన్ డకౌట్ అయి అభిమానులను నిరాశపరచడంతోపాటు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

క్రికెట్ లో కెప్టెన్ గా వ్యవహరించడం అంటే గొప్ప గౌరవం దక్కినట్టుగానే భావించాలి. అతి కొద్ది మందికి మాత్రమే జట్టును నడిపించే అవకాశాలు లభిస్తాయి. కొందరికి అనుకోకుండానే కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే పూర్తిస్థాయిలో ఆ బాధ్యతలు నిలబడతాయి. లక్నో జట్టు ప్లేయర్ క్రునాల్ పాండ్యాకు అటువంటి అరుదైన అవకాశం లభించింది. బుధవారం సాయంత్రం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో లో జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కింది. ముందు మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గాయపడడంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో జట్టు సారధ్య బాధ్యతలను సీనియర్ ప్లేయర్ అయిన క్రునాల్ పాండ్యాకు అప్పగించింది జట్టు యాజమాన్యం. అయితే, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు పాండ్యా.

తొలి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగిన పాండ్యా..

తొలిసారి లక్నో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడంతోపాటు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బరిలోకి దిగాడు పాండ్యా. 5.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయిన దశలో.. బ్యాటింగ్ కు వచ్చాడు క్రునాల్ పాండ్యా. మామూలుగా అయితే ఈ స్థితిలో జట్టు బాధ్యతలను తన భుజాలు వేసుకొని మెరుగైన ఇన్నింగ్స్ ఆడి పటిష్ట స్థితిలో నిలిపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ పాండ్యా ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో జట్టు మరింత కష్టాల్లో పడింది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో వెనువెంటనే వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది లక్నో జట్టు. అదృష్టవశాత్తు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఓటమి తప్పింది. మ్యాచ్ పూర్తిస్థాయిలో జరిగి ఉంటే లక్నో జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేదని పలువురు పేర్కొంటున్నారు.

పాండ్యా ఖాతాలో చేరిన చెత్త రికార్డు..

ఈ మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగిన పాండ్యా.. తన ఖాతాలో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయిన మూడో క్రికెటర్ గా క్రునాల్ పాండ్యా రికార్డుల్లోకి ఎక్కాడు. పాండ్యా కంటే ముందు వివిఎస్ లక్ష్మణ్ డెక్కర్ చార్జర్స్ తరఫున 2008లో ఇదేవిధంగా అవుట్ అయ్యాడు. అలాగే, మార్క్రమ్ కూడా ఈ ఏడాది సన్ రైజర్స్ జట్టుకు బాధ్యతలు స్వీకరించిన తొలి మ్యాచ్ లోనే డకౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. జట్టులో కీలక ప్లేయర్ గా ఎదుగుతున్న పాండ్య వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడని పలువురు పేర్కొంటున్నారు. అదృష్టవశాత్తు ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లేకపోతే పూర్తిస్థాయిలో మ్యాచ్ జరిగి ఉంటే లక్నో జట్టు ఓటమి పాలయ్యేది. అదే జరిగితే కెప్టెన్ గా వ్యవహరించిన తొలి మ్యాచ్ లోనే ఓటమి మూటగట్టుకున్న కెప్టెన్ గా మరో రికార్డు కూడా పాండ్యా ఖాతాలో చేరేదని పలువురు పేర్కొంటున్నారు.