Jr NTR’s wife Lakshmi Pranathi : ఉపాసన కొణిదెల త్వరలోనే ఒక బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా రీసెంట్ గా రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ లో తన మనసుకి ఎంతో దగ్గరైన మిత్రులను ఆహ్వానించాడు.వారిలో జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతి కూడా ఉన్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్, ఉపాసన మరియు లక్ష్మి ప్రణతి మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే.
వీళ్ళ స్నేహం కేవలం #RRR సినిమా సమయం ఏర్పడింది కాదు, అంతకు ముందు నుండే వీళ్ళు మంచి స్నేహితులు. ఎన్టీఆర్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన చరణ్ – ఉపాసన, అలాగే రామ్ చరణ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతి కచ్చితంగా హాజరవుతూ ఉంటారు. ఇక రామ్ చరణ్ ప్రతీ పుట్టినరోజుకు జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా తన ఇంట్లో ఉండాల్సిందే, ఈ విషయాన్నీ జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రస్తావించాడు.
ఇక రీసెంట్ గా జరిగిన సీమంతం ఫంక్షన్ లో ఉపాసన కోసం లక్ష్మి ప్రణతి తన చేతులతో చేసిన స్వీట్స్ ని బహుమతిగా ఇచ్చిందట. లక్ష్మి ప్రణతి చేసే స్వీట్స్ అంటే ఉపాసన కి మొదటి నుండి చాలా ఇష్టమట, అందుకే ఆమె కోసం గా స్పెషల్ గా స్వీట్స్ తయారు చేసి గిఫ్ట్ గా ఇచ్చిందట.ఇది ఉపాసనకు ఎంతో సంతోషాన్ని కలగచేసిందట.
తన మీద ప్రేమతో ఇంత కస్టపడి స్వీట్స్ తయారు చేసి తీసుకొచ్చినందుకు లక్ష్మి ప్రణతి కి థాంక్స్ చెప్పిందట ఉపాసన. లక్ష్మి ప్రణతి ఇచ్చిన ఆ గిఫ్ట్ బాక్స్ లో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయట. వాటితో పాటుగా డ్రై ఫ్రూప్ట్స్ కూడా అందులో ఉన్నాయట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఇక రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే , కొరటాల శివ తో ఎన్టీఆర్ మరియు శంకర్ తో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలు చేస్తున్నారు.