TATA Nano car : టాటా.. పేరుకు కార్పొరేట్ సామ్రాజ్యం అయినప్పటికీ ఈ దేశంతో అచంచలమైన అనుబంధాన్ని పెనవేసుకున్న కంపెనీ. చాలా కంపెనీలు లాభాల కోసం పని చేస్తే.. టాటా కంపెనీ మాత్రం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. అందుకే టాటా అంటే జనాలకు విపరీతమైన నమ్మకం. ఉప్పు నుంచి టైటాన్ వాచి వరకు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ టాటా కంపెనీ గణనీయమైన ఫలితాలు, లాభాలు నమోదు చేసింది. లక్షరాదిమందికి ఉపాధి కల్పిస్తోంది. మరి అంతటి టాటా కంపెనీ ప్రవేశపెట్టిన నానో కారు ఎందుకు విఫలమైంది? రతన్ తన మానస పుత్రికగా వర్ణించిన ఈ ఉత్పత్తి ఎందుకు జనాల మనసు చూరగొన లేకపోయింది? దీనికి మార్కెట్ వర్గాల కారణాలు ఎలా ఉన్నప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం దీనికి కొత్త భాష్యం చెబుతోంది.
ఇండియా గురించి తెలుసుకోవాల్సి ఉండేది
ఇండియా అంటే భిన్న సంస్కృతుల మేళవింపు మాత్రమే కాదు.. అంతకుమించిన జనాభా కూడా.. అలాంటప్పుడు మెజారిటీ జనం మనోగతం ఏమిటో తెలుసుకోవాల్సి ఉండేది.. పైగా లక్ష రూపాయలకు కారు ఇస్తున్నామని చెప్పిన కంపెనీ.. దానిని మన రోడ్లకు అనుగుణంగా మలచలేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. లక్ష రూపాయలకు కారు పోస్తుందని జనం కూడా వేలం వెర్రిగా ఏమీ కొనలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. పైగా మనదేశంలో పొదుపు అనేది ఎక్కువ కాబట్టి జనం కూడా టాటా కంపెనీ ఊహించనంత వేగంగా కొనుగోళ్ళు సాగించలేదు. ఇది కూడా ఓ మైనస్ పాయింట్. కనీసం అప్పటికైనా కంపెనీ జనాలకు ఏం కావాలో తెలుసుకుని ఉంటే బాగుండేది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఎన్నో లోపాలు
లక్ష రూపాయలకు కారు తీసుకొస్తున్నామని చెప్పిన టాటా… దాని డిజైన్ ను సరిగ్గా పట్టించుకోలేదు. ఇండియన్ రోడ్లకు సరిపోకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇంజన్లు కూడా మొరాయించాయి. కొన్నిచోట్ల ఇంజన్లు కాలిపోయాయి. దీంతో ఎన్నో ఆశలతో కారు కొనుక్కున్న మధ్యతరగతి వారు ఇబ్బంది పడ్డారు. ఇక దీనికి సంబంధించిన వార్తలు కూడా అప్పట్లో మీడియాలో ప్రముఖంగా రావడంతో జనం కూడా టాటా కారు కొనేందుకు ఇష్టపడలేదు. ఫలితంగా భారీ అంచనాల మధ్య టాటా నానో కారు ఆవిష్కరించిన రతన్ టాటా.. తర్వాత ఆత్మ రక్షణలో పడ్డారు. టాటా కంపెనీకి చెందిన మిగతా కార్లు భారీ విక్రయాలు నమోదు చేసుకుంటున్న సందర్భంలో.. నానో కారు విక్రయాలు తగ్గడం ఆయనను ఆలోచనలో పడేసింది. తర్వాత క్రమక్రమంగా ఆ ఉత్పత్తిని టాటా కంపెనీ నిలిపివేసింది.
సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్రచారం
ఇక నానో కారుకు సంబంధించి సోషల్ మీడియాలో మీమర్స్ రకరకాల వీడియోలు చేస్తూ నెటిజన్లకు అమితమైన ఆనందాన్ని పంచుతున్నారు. ఇక కింది లింక్ లో ఉన్న వీడియోలో ఒక కుటుంబం పని నిమిత్తం వేరే ఊరికి వెళుతూ ఉంటుంది. వారిలో పిల్లలు భార్యాభర్తలు ఉంటారు. భర్త బైక్ డ్రైవింగ్ చేస్తుండగా… భార్య తన పిల్లల్ని బండిమీద కూర్చోబెడుతుంది. చివరికి తాను కూడా ఎలాగోలా సర్దుకుంటుంది. మొత్తానికి కుటుంబ సభ్యులు హాయిగా బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు.. ఇలాంటి సౌలభ్యం భారతదేశానికి చెందిన మధ్యతరగతి కుటుంబ సభ్యులకు కల్పించకపోవడం వల్లే టాటా నానో కారు ఫెయిల్ అయిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం టాటా నానో కారు పై రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.