IPL 2024: ఐపీఎల్ లో ఆ జట్టే తోపు..కప్ కూడా గెలిచేది అదే..

ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ చివరి దశకు వచ్చింది. కోల్ కతా మినహా..ప్లే ఆఫ్ ఏ జట్లు వెళ్తాయో ఇప్పటికీ ఒక అంచనా లేదు. పోటీ చూస్తే రోజురోజుకు రసవత్తరంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ దాదాపుగా ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 14, 2024 4:17 pm

IPL 2024

Follow us on

IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందు క్రీడా విశ్లేషకులు రకరకాల అంచనాలను తెరపైకి తీసుకొచ్చారు. ఫలానా జట్లు మాత్రమే గెలుస్తుందని లెక్కలతో సహా చెప్పారు. ఐదుసార్లు ట్రోఫీలు గెలుచుకున్న ముంబై, చెన్నై జట్లు ఈసారి టైటిల్ రేసులో ముందు వరుసలో ఉంటాయని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మొత్తం తారు మారయ్యాయి.

ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ చివరి దశకు వచ్చింది. కోల్ కతా మినహా..ప్లే ఆఫ్ ఏ జట్లు వెళ్తాయో ఇప్పటికీ ఒక అంచనా లేదు. పోటీ చూస్తే రోజురోజుకు రసవత్తరంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ దాదాపుగా ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ కూడా చేరిపోయింది. ఈ మూడు జట్లు మినహాయిస్తే.. నాకౌట్ చేరేందుకు ఆరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ సీజన్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో ఒక జట్టు.. మిగతా అన్ని జట్లను భయపెడుతోంది. ఆ జట్టు ఆటగాళ్ల ముందు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ధైర్యంగా నిలబడలేక పోతున్నారు. ఆ జట్టే కోల్ కతా నైట్ రైడర్స్.

కోల్ కతా జట్టు దుమ్ము లేపే రేంజ్ లో ఆడుతోంది. ప్రత్యర్థి జట్లను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నది. ఇప్పటికే ఈ సీజన్లో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.. 13 మ్యాచ్లు ఆడి తొమ్మిది విజయాలు నమోదు చేసుకుంది. 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.. ఆ జట్టు ఆడే చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ టాప్ -2 లో కొనసాగడం గ్యారంటీ. ఎందుకంటే ఆ జట్టులో అందరూ ఆటగాళ్లు తమ స్థాయికి మించి ప్రదర్శన చేసేవాళ్లే ఉండటంతో అప్రతిహత విజయాలు సాధిస్తాంది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో కోల్ కతా జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది.. సునీల్ నరైన్,సాల్ట్, అయ్యర్, రింకూ సింగ్, అండ్రి రస్సెల్, వెంకటేష్ అయ్యర్ వంటి వారితో బ్యాటింగ్ భీకరంగా ఉంది. వీరిలో ఏ ఒక్కరు నిలబడినా మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. ముఖ్యంగా రస్సెల్, సునీల్ నరైన్, రింకూ సింగ్ వంటి వారు క్షణాల్లో మ్యాచ్ ను మార్చేయగలరు.

ఇక ఇప్పటివరకు కోల్ కతా గెలిచిన మ్యాచ్లలో.. ప్రత్యర్థులపై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది . బ్యాటింగ్ మాత్రమే కాదు కోల్ కతా బౌలింగ్ విషయంలోనూ తిరుగులేని పై చేయిని చూపిస్తోంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. స్టార్క్ తర్వాత వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, అండ్రీ రస్సెల్ వంటి వారు సైతం బౌలింగ్ లో అద్భుతాలు చేస్తున్నారు.. వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్లో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సుయాశ్ శర్మ తనకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతిభను నిరూపించుకుంటున్నాడు..

ఇక కోల్ కతా జట్టు లో రిజర్వ్ బెంచ్ కూడా బలంగా కనిపిస్తోంది. అనుకూల్ రాయ్, రెహమాన్ ఉల్లా గురుబాజ్, రాణా, చేతన్ సకారియా, చమీరా, శ్రీకర్ భరత్, మనీష్ పాండే వంటి వారు ఆ జట్టులో ఉన్నారు. ఇన్ని అనుకూలతలు ఉన్న నేపథ్యంలో ఈసారి కోల్ కతా జట్టు దే కప్ అని మాజీ ఆటగాళ్లతో సహా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.