Prabhas Remuneration : ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే కావడం విశేషం… ఇక ఇప్పటికే ఆయన దాదాపు ఆరు సినిమాలను పాన్ ఇండియాలో రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా అయితే భారీ కలెక్షన్స్ వచ్చాయనే చెప్పాలి. ఇక ప్లాప్ అయిన సినిమాలు కూడా దాదాపు 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడం విశేషం…
ఇక బాహుబలి 2 సినిమాతో ఏకంగా 1900 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి ఇండియా లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఈ సినిమా నిలవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఆయన ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను వదిలేస్తే ఇప్పుడు చేసే స్పిరిట్ అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో చేయబోయే సినిమాల కోసం దాదాపు 250 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరో కూడా ఇంత రెమ్యూనరేషన్ అయితే తీసుకోలేదు. కాబట్టి తెలుగు హీరో అయిన ప్రభాస్ బాలీవుడ్ హీరోలను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే నిజంగా తెలుగు వాళ్ళం అయిన మనందరం గర్వపడాల్సిన విషయం అనే చెప్పాలి. ఈ దెబ్బతో ఒక్కసారిగా మన తెలుగు హీరో నెంబర్ వన్ హీరోగా మారాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇదే విధంగా ప్రభాస్ కనక తన స్టార్ డమ్ ను కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం వ్యక్తి లేదు. ఇక రాబోయే సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుంటే తనను మించిన నటుడు మరొకరు ఉండరు అనేది మాత్రం వాస్తవం…