Pat Cummins
Pat Cummins : ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఏకంగా 280 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(Ishan kishan) ఏకంగా సెంచరీ చేశాడు. హెడ్ హాఫ్ సెంచరీ మార్క్ దాటేశాడు. క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో ఈసారి హైదరాబాద్ జట్టు 300 స్కోర్ చేస్తుందనే అంచనాలు పెరిగిపోయాయి. మీడియా, సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు తార స్థాయికి చేరుకున్నాయి. అయితే హైదరాబాద్ జట్టు ఆ తదుపరి లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లలో భారీగా పరుగులు చేయలేకపోయింది. చేసిన పరుగులను కాపాడుకోలేకపోయింది. ఫలితంగా వరసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో కిందకి దిగజారిపోయింది.
Also Read : సన్ రైజర్స్ కు వేధింపులు.. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ తో మారిన సీన్
తగ్గేది లేదు
లక్నో జట్టుతో ఓడిపోయినప్పటికీ.. ఢిల్లీ చేతిలో పరాజయం పాలైనప్పటికీ.. తగ్గేదే లేదని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ చెబుతున్నాడు..” గడచిన రెండు మ్యాచ్లలో ఘోరంగా ఓడిపోయాం. అయినప్పటికీ మా దూకుడు తగ్గదు. మా తదుపరి మ్యాచ్ కోల్ కతా తో ఆడతాం. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.. రిస్క్ లేకుండా 160 నుంచి 170 కొట్టాలనే స్టైల్ మాది కాదు.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అనికేత్ వర్మ (Aniket Verma) కు ఇంకొకరు తోడైతే స్కోరు 200 దాకా వచ్చేది. అప్పుడు మ్యాచ్ మన చేతిలో ఉండేది. రెండు మ్యాచ్లలో ఓడిపోయిన తర్వాత పాఠాలు నేర్చుకున్నాం. అందులో అనుమానం లేదు. కాకపోతే దూకుడు తగ్గదు. వేగవంతమైన ఆట తీరు మారదు. వేగం, ఎదురుదాడి అనేవి తగ్గవు. కచ్చితంగా స్పీడ్ గానే పరుగులు తీస్తాం. అటువంటి ఆట మార్చుకోవాలంటే t20 లకు కుదరదని” ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. అతడు మాట్లాడిన ఈ వీడియోను హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ లెక్కన కోల్ కతా జట్టు తో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోర్ చేయడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత సీజన్లో ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. మరో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా సొంత మైదానంలో అదరగొట్టాలని.. హైదరాబాద్ జట్టుపై విజయపరంపర కొనసాగించాలని యోచిస్తోంది.
Also Read : 250+ స్కోర్ చేయకపోతే ట్రోల్స్ తప్పవా.. భారీ అంచనాలే SRH కొంప ముంచాయా?
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Pat cummins sunrisers hyderabad captain cummins comments on team performence
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com