Virat Kohli: సంచలనం?: వన్డే కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై.?

Virat Kohli: భారత జట్టు సారధి విరాట్ కోహ్లి వన్డే క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి తాజాగా వన్డే జట్టుకు కూడా టాటా చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా విరాట్ కోహ్లి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో కెప్టెన్సీ బాధ్యతలకు విరామం ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]

Written By: Srinivas, Updated On : December 8, 2021 6:01 pm
Follow us on

Virat Kohli: భారత జట్టు సారధి విరాట్ కోహ్లి వన్డే క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి తాజాగా వన్డే జట్టుకు కూడా టాటా చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా విరాట్ కోహ్లి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో కెప్టెన్సీ బాధ్యతలకు విరామం ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Virat Kohli

ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్ గా రాణిస్తున్నాడు. న్యూజిలాండ్ తో టీ 20, టెస్ట్ సిరీస్ నెగ్గి తానేమిటో నిరూపించుకున్నాడు. టెస్ట్ సిరీస్ లో అయితే 372 పరుగుల భారీ తేడాతో సిరీస్ కైవసం చేసుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టుకు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ గా నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ టీమిండియా మూడు టెస్టులు, వన్డేలు ఆడనుందని తెలుస్తోంది. ఒకపక్క ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ఉన్న నేపథ్యంలో భారత జట్టు పర్యటన సాఫీగా జరుగుతుందో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో టీమిండియా జట్టు కూర్పుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టులో చేరేదెవరో?

2023లో జరిగే వరల్డ్ కప్ కు సమయం ఉండటంతో భారత జట్టును ఫామ్ లో కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోహిత్ శర్మ సారధ్యంలోనే భారత జట్టును తీర్చిదిద్దాలని భావిస్తోంది. దీని కోసం ఆటగాళ్లను తయారు చేయాలని చూస్తోంది. విరాట్ కోహ్లి తప్పుకుంటే రోహిత్ శర్మను మంచి సారధిగా తీర్చిదిద్దాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: IPL: వదిలేసుకున్న ప్లేయర్లను ప్రాంచైజీలు చేజ్కించుకుంటాయా?

Tags