https://oktelugu.com/

Bhola Shankar: ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” మూవీ…

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాలకు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా చేతిలో 4 సినిమాలు ఉంచుకొని అభిమానుల‌ను అలరించేందుకు సిద్దమయ్యారు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య’ షూటింగ్​ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు. అలానే “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 05:59 PM IST
    Follow us on

    Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాలకు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా చేతిలో 4 సినిమాలు ఉంచుకొని అభిమానుల‌ను అలరించేందుకు సిద్దమయ్యారు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య’ షూటింగ్​ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు. అలానే “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాగా… కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఒక మాసివ్ సాంగ్ ని కంప్లీట్ చేసినట్టుగా యూనిట్ ప్రకటించింది.

    Bhola Shankar

    Also Read: భిన్నంగా స్పీడ్ పెంచిన మెగాస్టార్ !

    ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆన్ లొకేషన్ ఫొటోస్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో భారీ సెట్టింగ్స్ లో షూట్ చేశారు అని తెలుస్తుంది. ఇక చిత్ర యూనిట్ ఆల్రెడీ రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసేసినట్టు తెలిపగా వచ్చే ఏడాది సమ్మర్ కి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం అందుతుంది. ఈ మూడు సినిమాలు పూర్తి కాకుండానే వెంకీ కుడుముల, మారుతి లతో సినిమాలకి మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పినట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

    https://twitter.com/BholaaShankar/status/1468469521740488705?s=20

    Also Read: మెగాస్టార్ చిరు సినిమాలో నటించేందుకు రవితేజ రెమ్యూనరేషన్ ఎంతంటే ?