Ind Vs Aus 2nd Test: ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పరుగులేమీ చేయకుండానే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) కు స్టార్క్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ (37), గిల్(31) భారత జట్టు ఇన్నింగ్స్ భారాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 69 పరుగులు జోడించారు. అయితే వీరు స్వల్ప పరుగుల తేడాతో అవుట్ అయ్యారు. రాహుల్ స్టార్క్, గిల్ బోలాండ్ బౌలింగ్లో పెవిలియన్ చేరుకున్నారు. వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ కావడంతో టీమ్ ఇండియాకు కష్టాలు మొదలయ్యాయి. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడు పరుగులు మాత్రమే చేసి బోలాండ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (21) కమిన్స్ బౌలింగ్ లో లబూ షేన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.. ఈ దశలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (11), రవిచంద్రన్ అశ్విన్ (1) తో కలిసి ఆడుతున్నాడు. స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. బోలాండ్ రెండు వికెట్లు సాధించాడు. కమిన్స్ ఒక వికెట్ అందుకున్నాడు.
మైదానంలో సంచలనం
రెండో టెస్ట్ జరుగుతున్న అడిలైడ్ మైదానంలో రాహుల్ అవుట్ విధానం సంచలనంగా మారింది. బోలాండ్ వేసిన బంతిని రాహుల్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి బ్యాట్ నుంచి మిస్ అయ్యి..బ్యాట్ కు అతి దగ్గరగా వెళ్ళింది. దీంతో ఆ బంతిని అందుకున్న కీపర్.. అంపైర్ కు అప్పీల్ చేయగా.. ఆయన అవుట్ ఇచ్చాడు. దీంతో రాహుల్ మైదానం నుంచి బయటికి వెళ్ళాడు. ఈ క్రమంలో అంపైర్ మరోసారి రివ్యూ చూడగా.. అది నోబాల్ అని తేలింది. దీంతో వెంటనే నాట్ అవుట్ అని ప్రకటించాడు. మరోవైపు సికోమీటర్లో ఆ బంతి బ్యాట్ కు తగలలేదని స్పష్టమైనది. దీంతో కేఎల్ రాహుల్ మళ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ మైదానాన్ని వీడేందుకు ప్రయత్నించినప్పుడు.. బ్యాటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అతడు బయలుదేరాడు. అయితే ఎంపైర్ నాట్ అవుట్ అని ప్రకటించడంతో.. మళ్లీ విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు.. ఈ సంఘటన మైదానంలో సంచలనం సృష్టించగా.. అంపైర్ తీరుపై భారత అభిమానులు మండిపడుతున్నారు. సరిగ్గా చూసుకోకుండానే ఎలా అవుట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియా ఫీల్డర్లు అప్పీల్ చేయగానే అవుట్ ఇవ్వడం ఏంటని.. వారు మండిపడుతున్నారు.
అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ లో కేఎల్ రాహుల్ అవుట్ వివాదమైంది. బోలాండ్ వేసిన బంతిని రాహుల్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. అతడు అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. రాహుల్ క్రీజ్ వదిలి వెళ్ళగా.. ఆ బంతిని అంపైర్ నో బాల్ అని ప్రకటించాడు.#BGT2024#AUSvsIND pic.twitter.com/antmYqML9h
— Anabothula Bhaskar (@AnabothulaB) December 6, 2024