https://oktelugu.com/

Fushpa 2 Effect: మూవీ లవర్స్ కి భారీ షాక్, ఇకపై అవి రద్దు, కారణం ఇదే!

మూవీ లవర్స్ ని ఇది ఇబ్బంది పెట్టే అంశం. ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ గుండెలు బద్దలు కావడం ఖాయం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఓ అద్భుతమైన అనుభూతి దూరం కానుంది. ఇంతకీ మేటర్ ఏంటంటే?

Written By:
  • S Reddy
  • , Updated On : December 6, 2024 / 01:42 PM IST

    Fushpa 2 Effect

    Follow us on

    Fushpa 2 Effect: స్టార్ హీరోలపై అభిమానులకు ఉండే ప్రేమకు కొలమానం లేదు. తమ ఆరాధ్య హీరో కోసం అభిమానులు ఏదైనా చేస్తారు. సదరు హీరో కొత్త మూవీ కోసం ఎదురు చూస్తారు. ప్రకటన నాటి నుండి, ఒక్కో అప్డేట్ ఫాలో అవుతారు. అప్డేట్స్ ఆలస్యం అయితే దర్శక నిర్మాతలను సోషల్ మీడియాలో ఏకి పారేస్తారు. లేటెస్ట్ అప్డేట్ ఇవ్వకపోతే… ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించిన అభిమానులు కూడా ఉన్నారు. అభిమానం అంత వెర్రిగా ఉంటుంది. సినిమా విడుదల అవుతుందంటే పండగే.

    ఓ వారం రోజుల ముందు నుండే నిద్రపట్టదు. సినిమా ఎప్పుడు చూడాలా అని తహతహలాడుతూ ఉంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు ఒకరోజు ముందే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు ఏర్పాటు చేస్తారు. వీటికి అభిమానులు పోటెత్తుతారు. టికెట్ ధరకు వెనకాడకుండా ఎంతైనా వెచ్చించి ఫస్ట్ షో చూస్తారు. అప్పుడు కాని వారికి మనశ్శాంతి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల సంస్కృతి చాలా కాలంగా ఉంది. ఏపీలో గత ప్రభుత్వం వీటిని కట్టడి చేసింది. బెనిఫిట్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేది కాదు.

    తెలంగాణాలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా బెనిఫిట్ షోల ప్రదర్శన కొనసాగుతుంది. అయితే పుష్ప 2 ప్రీమియర్స్ ప్రదర్శనలో విషాదం చోటు చేసుకుంది. వేల మంది అభిమానులు డిసెంబర్ 4రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో గుంపును అదుపు చేయడం కోసం పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారట. తొక్కిసలాట చోటు చేసుకోగా రేవతి అనే 35 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మరణించింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు సైతం ప్రమాదానికి గురయ్యాడు. బాలుడికి చికిత్స జరుగుతుంది.

    ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యం, పుష్ప 2 నిర్మాతలపై కేసు ఫైల్ అయినట్లు సమాచారం. అలాగే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై విడుదల ముందు రోజు రాత్రి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదు, రద్దు చేయాలని భావిస్తున్నారట. సంక్రాంతి సినిమాలతో పాటు భవిష్యత్ లో విడుదలయ్యే బడా సినిమాలకు అనుమతి ఇవ్వరు అట. ఉదయం 7 గంటలకు షో స్టార్ట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన అట. అధికారిక సమాచారం అందాల్సి ఉంది.