KL Rahul : కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున అదరగొట్టాడు. కాకపోతే కీలక సమయంలో ఢిల్లీ జట్టు ఆశించినంత స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేకపోవడంతో గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది. ఐపీఎల్ లో అతడు ఆడుతున్నప్పుడే ఇంగ్లీష్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియాను మేనేజ్మెంట్ ప్రకటించింది. అందులో కె.ఎల్ రాహుల్ కు చోటు లభించింది. కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్ అద్భుతంగా ఆడతాడు. మిస్టర్ డిపెండబుల్ ను గుర్తుకు తెస్తాడు. ముఖ్యంగా మణికట్టు షాట్లు ఆడటంలో అతడికి అతడే సాటి. పైగా రోహిత్, విరాట్ జట్టులో లేకపోవడంతో అతడి సేవలు అవసరమని భావించి మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ ఎంపికను మాజీ ప్లేయర్లు సైతం స్వాగతిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం అని కితాబిస్తున్నారు.
Also Read : రెచ్చిపోయిన కాటేరమ్మ కొడుకులు.. క్లాసెన్ సెంచరీ.. SRH 278.. రికార్డులు సునామీ
కేఎల్ రాహుల్ ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ముఖ్య ఇన్నింగ్స్ ఆడాడు. కంగారులతో జరిగిన మ్యాచ్లో తనదైన విశ్వరూపాన్ని చూపించాడు. ఫలితంగా వన్డేలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే టి20 లలో రాహుల్ తన స్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లోకి తిరిగి రావాలని భావిస్తున్నట్టు అతడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో గత ఐదు సీజన్లలో 140 కంటే తక్కువ స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. అతడు నిదానంగా ఆడతాడని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుత సీజన్లో కేఎల్ రాహుల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు 149.72 స్ట్రైక్ రేట్ తో 538 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ కు పొట్టి ఫార్మాట్లో విరివిగా అవకాశాలు లభించలేదు. ఒకవేళ అతడికి కనుక అవకాశాలు లభిస్తే మరింత గొప్పగా ఆడేవాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అతడికి జట్టులో స్థానం గనుక కల్పిస్తే సింహం లాగా ఎదురుదాడికి దిగుతాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. మెరుపు వేగంతో పరుగులు తీసి.. సరికొత్త రికార్డులను కచ్చితంగా సృష్టిస్తాడు.
” వన్డేలలో తను ఏంటో నిరూపించుకున్నాడు. తను నిలబడితే ఏ స్థాయిలో పరుగులు చేస్తాడో చూపించాడు. ఇక టెస్ట్ క్రికెట్లోనూ అతడు గతంలోనే అదరగొట్టాడు. త్వరలో ఇంగ్లీష్ జట్టుతో జరిగే సిరీస్లో కచ్చితంగా ముఖ్యపాత్ర పోషిస్తాడు. అటువంటి ఆటగాడికి టి20 లో గనుక చోటు లభిస్తే టీమిండియా కు తిరుగు ఉండదు.పైగా అతడు ప్రస్తుత ఐపీఎల్ లో స్థిరమైన ఆట తీరు ప్రదర్శించాడు. తన సొంత మైదానంలో బెంగళూరు పై ఎంతటి విధ్వంసం సృష్టించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ లో అతడికి చోటు ఇస్తే భారత జట్టుకు తిరుగు ఉండదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు