SRH IPL 2025 : కానీ హైదరాబాద్ జట్టు ఆ తదుపరి అంతగా ఆడలేకపోయింది. వరుసగా ఓటములు ఎదుర్కొని తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ దశలో హైదరాబాద్ జట్టు పై నెగిటివ్ ప్రచారం కూడా మొదలైంది. 300 స్కోర్ లోడింగ్ కాదు కదా.. కనీసం మ్యాచులు గెలవండి చాలనే విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు 300 లోడింగ్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల హైదరాబాద్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రతి మ్యాచ్ లోను హార్డ్ హిట్టింగ్ చేద్దామని భావించి బోల్తా పడ్డారు. చివరికి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుని.. గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయారు. ఈ సీజన్లో చివరి రెండు మ్యాచ్లు వరుసగా గెలిచిన కావ్య మారన్ జట్టు.. చివరి మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో.. హైదరాబాద్ బ్యాటర్లు సింహతాండవం చేస్తున్నారు.
హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 32, హెడ్ 76 పరుగులతో అదరగొట్టారు. తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 100 సెంచరీతో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ 29 పరుగులతో సహకరించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలోనే హైదరాబాద్ జట్టు 178 పరుగుల భారీ స్కోరు చేసింది. వాస్తవానికి హెడ్ సెంచరీ చేస్తాడని అనుకున్నప్పటికీ.. నరైన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ కూడా అతనికి దొరికిపోయాడు. వాస్తవానికి అభిషేక్ శర్మ ఔట్ అవకుండా ఉండి ఉంటే.. హైదరాబాద్ స్కోర్ మరో విధంగా ఉండేది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ మైదానంపై హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. క్రాసెన్ సెంచరీ, హెడ్ 76, అభిషేక్ 32 పరుగులతో దంచి కొట్టడంతో ఈ భారీ స్కోరు నమోదైంది.
కిషన్, క్లాసెన్ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో కచ్చితంగా హైదరాబాద్ 300 స్కోర్ చేస్తుందని అభిమానులు అంచనా వేసినా చివర్లో కోల్కతా మెరుగైన బౌలింగ్ తో 278కి పరిమితమైంది. 300 స్కోర్ లోడింగ్ అనుకున్నా చేరువ కాలేకపోయారు. ఇదే జరిగితే హైదరాబాద్ పేరు మీద సరికొత్త రికార్డు నమోదు అయ్యి ఉండేది. గత సీజన్లో బెంగళూరు, ముంబై, లక్నో తో తల పడినప్పుడు హైదరాబాద్ భారీగా పరుగులు చేసింది. ఇప్పుడు తన ప్రతాపాన్ని కోల్ కతా మీద చూపిస్తోంది. గ్రూప్ దశలో కీలకమైన మ్యాచ్ లో కోల్ కతా హైదరాబాద్ జట్టును ఓడించింది. ఇప్పుడు కావ్య జట్టు ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉందని” హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Six hitting at its best pic.twitter.com/tHiDttyqX1
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2025
It's raining sixes in Delhi pic.twitter.com/osepxekPCM
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2025