Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే కేసులో అరెస్టైన వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.