https://oktelugu.com/

KL Rahul: నిన్న 4.. నేడు 10.. ఇటువంటి ఆటగాడినా ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేసింది? వీడియో వైరల్

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ 0-3 తేడాతో టీమ్ ఇండియా కోల్పోయింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్లో దారుణమైన ఆటతీరు ప్రదర్శించింది. దీంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ప్రవేశించాలంటే ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యంత ముఖ్యంగా మారింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 / 06:54 PM IST

    KL Rahul(3)

    Follow us on

    KL Rahul: టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ప్రవేశించాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో గెలవాలి. 5-0 తేడాతో విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి అడుగుపెడుతుంది. కానీ అది అంత సులభం కాదు. ఈ నెలలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికా తో నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. శుక్రవారం డర్బన్ వేదికగా తొలి మ్యాచ్ మొదలవుతుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంటే ముందు భారత – ఏ జట్టు ఆస్ట్రేలియా – ఏ జట్టుతో అనధికారిక టెస్ట్ మ్యాచులు ఆడుతోంది. తొలి మ్యాచ్ లో భారత జట్టుకు అనుకూలంగా ఫలితం రాలేదు. రెండో మ్యాచ్ లో నైనా విజయం సాధిస్తుందని భావిస్తే.. ఈ మ్యాచ్ లోనూ భారత ఆటగాళ్లు నిరాశ పరుస్తున్నారు. ముఖ్యంగా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తన వైఫల్యాన్ని చాటుకుంటున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో పది పరుగులకే అవుట్ అయ్యాడు. అతడు వెనుతిరిగిన సందర్భాన్ని చూస్తుంటే ఆశ్చర్యంతో పాటు జాలి కూడా కలుగుతుంది. ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ రాకే చోళీ వేసిన బంతిని రాహుల్ తప్పుగా అంచనా వేశాడు. అది ఏకంగా లెగ్ సైడ్ వెళ్ళిపోతూ వికెట్లను పడగొట్టింది..

    చెత్త అంచనా

    రాకే చోళి వేసిన బంతి గుడ్డు లెంగ్త్ లో పడినప్పటికీ దానిని రాహుల్ తప్పుగా అనుకున్నాడు. ఆ బంతి తనకు దూరంగా వెళుతుందని అంచనా వేశాడు. కానీ ఆ బంతి ఒక్కసారిగా టర్న్ అయింది. అది లెగ్ వికెట్ వైపు మళ్ళింది. అంతే ఆ బంతిని ఎడమకాలితో నిలువరిద్దామని రాహుల్ అనుకున్నప్పటికీ.. ఆ బంతి లిప్త పాటు కాలంలో లెగ్ వికెట్ ను పడగొట్టింది..దీంతో రాహుల్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లి పోయాడు.

    జట్టులో చోటు దక్కదు

    రాహుల్ అవుట్ అయిన విధానం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. దీంతో ఇండియా అభిమానులు రాహుల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఇకపై జట్టులో అవకాశం దక్కుతుందనే విషయాన్ని మర్చిపో.. వెంటనే ఇండియాకి వెళ్లి రంజీలు, ఐపీఎల్ లు ఆడుకొమ్మని సలహాలు ఇస్తున్నారు.. పై మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ లో భారత – ఏ జట్టు ఇప్పటివరకు ఐదు వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి (9), ధృవ్ జురెల్(19) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఇన్నింగ్స్ లో భారత – ఏ జట్టు 161 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా – ఏ జట్టు 223 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత ఏ జట్టు ఆస్ట్రేలియా కంటే ఇంకా 11 పరుగులు వెనుకబడి ఉంది.