https://oktelugu.com/

Pradeep Machiraju: టీడీపీ ఎమ్మెల్యే తో యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్..ముహూర్తం కూడా ఖరారు..ఇంతకీ ఆ లేడీ ఎమ్మెల్యే ఎవరంటే!

అకస్మాత్తుగా ఆయన ఢీ షో తో పాటు, ఇతర ఎంటెర్టైమెంట్స్ షోస్ కి కూడా యాంకరింగ్ ఆపి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అసలు ప్రదీప్ ఏమయ్యాడు, ఎక్కడా కనిపించడం లేదే?, ఏదైనా ఆరోగ్య సమస్యల కారణంగా బుల్లితెర కి దూరం అయ్యాడా?, లేకపోతే ఇక యాంకరింగ్ పూర్తిగా మానేద్దామని అనుకున్నాడా?, ఆయన అదృశ్యానికి కారణం ఏమిటి అని సోషల్ మీడియా లో ప్రదీప్ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 / 06:58 PM IST

    Pradeep Machiraju

    Follow us on

    Pradeep Machiraju: బుల్లితెరలో ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన యాంకర్స్ కొంత మంది ఉంటారు. వీళ్ళకి బుల్లితెర మీద కనిపిస్తే చాలు, మన ముఖాల్లో నవ్వు వచ్చేస్తుంది. అలా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాంకర్స్ లో ఒకరు ప్రదీప్ మాచిరాజు. చిన్న చిన్న షోస్ తో మొదలైన ఆయన కెరీర్, ప్రదీప్ లేకపోతే షోస్ ని నడపలేము అనే స్థాయి కి చేరింది. ముఖ్యంగా ఈటీవీ ప్రసారమయ్యే ‘ఢీ’ షో ప్రదీప్ కి ఎంతోమంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. సుడిగాలి సుధీర్ తో కలిసి ఆయన పండించే కామెడీకి ప్రేక్షకుల పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఇప్పటికీ వీళ్లిద్దరు కలిసి చేసిన ఎపిసోడ్స్ ని యూట్యూబ్ లో నెటిజెన్స్ చూస్తూనే ఉంటారు. కేవలం ఈటీవీ లో మాత్రమే కాకుండా జీటీవీ, స్టార్ మా చానెల్స్ లో కూడా ప్రదీప్ ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా వ్యవహరించాడు. అయితే ఈమధ్య కాలం లో ప్రదీప్ బుల్లితెర పై కనిపించడం ఆపేసాడు.

    అకస్మాత్తుగా ఆయన ఢీ షో తో పాటు, ఇతర ఎంటెర్టైమెంట్స్ షోస్ కి కూడా యాంకరింగ్ ఆపి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అసలు ప్రదీప్ ఏమయ్యాడు, ఎక్కడా కనిపించడం లేదే?, ఏదైనా ఆరోగ్య సమస్యల కారణంగా బుల్లితెర కి దూరం అయ్యాడా?, లేకపోతే ఇక యాంకరింగ్ పూర్తిగా మానేద్దామని అనుకున్నాడా?, ఆయన అదృశ్యానికి కారణం ఏమిటి అని సోషల్ మీడియా లో ప్రదీప్ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించారు. అయితే ఆయన ఈ షోస్ అన్నిటిని ఆపేయడానికి అసలు కారణం, సినిమాల్లోకి వెళ్లడం వల్లే. వరుసగా ఆయన నాలుగు సినిమాల్లో హీరో గా నటించడానికి సంతకాలు చేసాడట. అందులో మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’. ఢీ షో లో ప్రదీప్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ అందించిన దీపికా పిల్లి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి ముందు ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా మూడేళ్ళ క్రితం విడుదలై కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    ఇదంతా పక్కన పెడితే బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు ప్రదీప్. ఈయన పెళ్లి గురించి ఎన్నో జోక్స్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో వేసుకునేవారు. అయితే చాలా కాలం నుండి ఒక యంగ్ లేడీ పొలిటీషియన్ తో ప్రదీప్ రహస్య ప్రేమాయణం నడుపుతున్నాడు. వీళ్లిద్దరు కలిసి పబ్ లో కనిపించడం, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో అప్పట్లో తెగ వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె టీడీపీ, జనసేన ప్రభుత్వం లో ఎమ్మెల్యే గా ఎన్నికైంది. పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యే గా గెలవడం గమనార్హం. అంతే కాదు, ఈ అందానికి సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యంగ్ ఎమ్మెల్యే గా దూకుడుతో దూసుకుపోతున్న ఈమెతో ప్రదీప్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.