KL Rahul : బెంగళూరు జట్టులో కీలక ఆటగాళ్లు విఫలమైనప్పటికీ.. కేఎల్ రాహుల్ స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. ఏకంగా 93 పరుగులు చేసి ఆదరగొట్టాడు. చివరి వరకు అతడు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి.. బెంగళూరు బౌలర్లకు కొరకరాని కొయ్య అయ్యాడు ఢిల్లీ జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. నిన్న రాత్రి ఢిల్లీ జట్టు విషయంలో ముఖ్యపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అభిమానులు అతడికి రకరకాల రూపాలలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీమ్స్, వీడియోలకైతే ఇక లెక్కేలేదు.. సౌత్ లో సూపర్ హిట్ అయిన కేజీఎఫ్, సలార్ సినిమాలలో జనాలకు విపరీతంగా కనెక్ట్ అయిన సీన్స్ ను కే ఎల్ రాహుల్ కు అన్వయిస్తూ.. వీడియోలను రూపొందిస్తున్నారు. కే జి ఎఫ్ లో రాఖీ బాయ్ లాగా.. సలార్ లో దేవా లాగా కేఎల్ రాహుల్ ను చూపించారు. అది కేఎల్ రాహుల్ అభిమానులకే కాదు.. చివరికి ప్రభాస్, యష్ అభిమానులకు కూడా విపరీతంగా నచ్చింది.
Also Read : పోటీలో ముగ్గురు.. రుతు రాజ్ గైక్వాడ్ స్థానంలో ఎవరు?
కాంతారా నుంచి స్ఫూర్తి పొందాడట
ఢిల్లీ జట్టుకు విజయాన్ని అందించిన తర్వాత కేఎల్ రాహుల్ తనకు మాత్రమే సాధ్యమైన తీరులో బ్యాట్ తో విన్యాసాలు చేశాడు. చిన్న స్వామి స్టేడియం తన అడ్డా అని ప్రకటించాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ భీకరంగా కనిపించాడు. సాధారణంగా శాంత స్వభావంతో ఉండే కేఎల్ రాహుల్ ఆ సమయంలో ఒక్కసారిగా సరి కొత్తగా కనిపించాడు.. అయితే తనకు అత్యంత నచ్చిన కాంతారావు సినిమాలోని క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నుంచి ప్రేరణ పొంది.. ఈ వేడుకలు జరుపుకున్నట్టు కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. “నేను బెంగళూరులో పెరిగాను. ఇది నా సొంత ప్రాంతం. ఇది నా సొంత మైదానం” అంటూ కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక సోషల్ మీడియాలో తెగ హైలెట్ చేసింది. ఇక కేఎల్ రాహుల్ 93 పరుగులు చేసి.. తమ జట్టును కేజీఎఫ్ సినిమాలోని రాఖీ లాగా.. చలో సినిమాలో దేవాలాగా ఆదుకున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యాఖ్యానించింది. దానికి తగ్గట్టుగా వీడియోలను కూడా రూపొందించింది..ఇక స్టబ్స్ ఆడిన తీరు పెద్ది సినిమాలోని రామ్ చరణ్ ఆడిన క్రికెట్ మాదిరిగా ఉందని.. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలోని కొన్ని దృశ్యాలను స్టబ్స్ ఆట తీరుకు నిదర్శనంగా ఉన్నాయంటూ ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ALso Read : గెలికిన కోహ్లీకి.. గెలిపించి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాహుల్.. వీడియో