Homeక్రీడలుక్రికెట్‌Chennai Super Kings: పోటీలో ముగ్గురు.. రుతు రాజ్ గైక్వాడ్ స్థానంలో ఎవరు?

Chennai Super Kings: పోటీలో ముగ్గురు.. రుతు రాజ్ గైక్వాడ్ స్థానంలో ఎవరు?

Chennai Super Kings: రుతు రాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండకపోవడంతో చెన్నై జట్టు మేనేజ్మెంట్ అతని స్థానంలో సీజన్ ముగిసే వరకు తాత్కాలిక కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. మోచేతి గాయంతో బాధపడుతూ.. సీజన్ మొత్తానికి దూరమైన రుతు రాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఎవరిని తీసుకుంటుందనే చర్చ మొదలైంది. జాతీయ మీడియాలో రుతు రాజ్ గైక్వాడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని విషయంపై రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి.. అయితే ఇందులో పృథ్వి షా, మయాంక్ అగర్వాల్, ఆయుష్ మాత్రే ఎవరో ఒకరిని తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా తన కథనాలలో స్పష్టం చేసింది.

Also Read: సొంత మైదానంలో..RCB చెత్త రికార్డు

అనుభవం చాలా

పృథ్వి షా, మయాంక్ అగర్వాల్ కు ఐపీఎల్ లో చాలా సీజన్లు ఆడిన అనుభవం ఉంది. అయితే ఆయుష్ మాత్రే మాత్రం ఇంతవరకు ఐపీఎల్ లో ఆడలేదు. అతని వయసు 17 సంవత్సరాలు. ఇటీవల దేశవాళి క్రికెట్ టోర్నీలలో అతడు ఆడాడు. తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిలో ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది అంతుపట్టకుండా ఉంది. పృథ్వి షా గతంలో లావుగా ఉండేవాడు. క్రమశిక్షణతో ఉండేవాడు కాదు. అయితే ఇటీవల అతడు పూర్తిగా మారిపోయాడు. తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చేసుకున్నాడు. దేశవాళి క్రికెట్లోనూ అదరగొట్టాడు. చెన్నై జట్టుకు ఇప్పుడు విజయాలు కావాలి కాబట్టి పృథ్వి కి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ అతని పక్కన పెడితే అనుభవం దృష్ట్యా.. ఐపీఎల్ ఆడిన నేపథ్యం దృష్ట్యా మయాంక్ అగర్వాల్ కు చోటు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ధోని ఒత్తిడి మేరకు.. కొత్త ఆటగాళ్లు మాత్రమే కావాలని అతడు కోరితే.. కచ్చితంగా ఆయుష్ మాత్రే కు అవకాశం లభించవచ్చు. ” ముగ్గురు పోటీలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు చెన్నై జట్టుకు విజయాలు అవసరం. ధోని చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. దాదాపు సుదీర్ఘకాలం తర్వాత అతడు జట్టు పగ్గాలను అందుకున్నాడు. అలాంటప్పుడు ఓటములను ధోని ఇష్టపడకపోవచ్చు. అందువల్లే జట్టుకు ఉపయోగపడే వారికి మాత్రమే అవకాశం లభించవచ్చు. ఈ జాబితాలో ఆయుష్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతడికి మాత్రం అవకాశం లభిస్తే పంట పండినట్టేనని” చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చెన్నై జట్టు యాజమాన్యం మాత్రం.. ఇప్పటికే ప్లే ఎలెవన్ జాబితాలో ఎవరు ఉంటారనే విషయంపై ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. జట్టు అవసరాలకు సరిపోయే ఆటగాడికి అవకాశం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఆటగాడు ఎవరనేది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.

Also Read: హేజిల్ వుడ్ కు చుక్కలు.. స్టబ్స్ తో కలిసి మెరుపులు.. కేఎల్ రికార్డులు ఇవి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version