KKR Vs RR IPL 2025: ” అతని మీద అనవసరమైన ఒత్తిడి పెట్టకండి. అతడిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయకండి. అతడు వచ్చిందే 14 సంవత్సరాల ప్రాయంలో. ఇలాంటి సమయంలో అతడిని ఇబ్బంది పెడితే మొదటికే మోసం వస్తుంది. అన్నట్టు దీనిని గనక మెదడులో పెట్టుకుంటే వైభవ్ కూడా ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత అనుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను క్రికెట్ ప్రపంచంలో చాలామందిని చూసాం. అందులో గట్టిగా నిలబడ్డవారు తక్కువమంది. అలాంటి వారిలో ఇతడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే అతడు గట్టిగా నిలబడాలని భావిస్తున్నానని” ఇటీవల వైభవ్ సూర్య వంశీ గురించి సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. వైభవ్ సూర్య వంశీ సెంచరీ చేస్తే.. దిగ్గజ ప్లేయర్లు మెచ్చుకున్నారు. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం విభిన్నంగా మాట్లాడాడు. దీంతో చాలామంది అతడు తీరుపై నొచ్చుకున్నారు. అదేంటి సునీల్గా గవాస్కర్ అలా మాట్లాడుతున్నాడంటూ ఆశ్చర్య వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలనే సమర్థిస్తున్నారు.
Also Read: యష్ దయాళ్..నాడు తిట్టారు.. నేడు హీరో అంటూ పొగుడుతున్నారు..
మళ్లీ విఫలమయ్యాడు
గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ తో వైభవ్ సూర్య వంశీ ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇంకేముంది అతడిని అందరూ కాబోయే సచిన్ టెండుల్కర్ అని.. టీమిండియాలో స్థానం సంపాదిస్తాడని.. క్రికెట్ మొత్తాన్ని శాసిస్తాడని అందరూ వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. వైభవ్ సూర్యవంశీని జాకిలు పెట్టి లేవడం ప్రారంభించారు. కానీ ఎదిగినంతసేపు పట్టలేదు పడిపోవడానికి.. గుజరాత్ సూపర్ సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్య వంశీ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ వాటిని అందుకోవడంలో వైభవ్ సూర్యవంశీ విఫలమవుతూనే ఉన్నాడు. ఒత్తిడి.. విపరీతమైన అంచనాలు.. ఇంకా రకరకాల కారణాలవల్ల వైభవ్ సూర్య వంశీ ఇబ్బంది పడుతున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెబుతున్నప్పటికీ.. వైభవ్ సూర్య వంశీ తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోలేకపోతున్నాడు. అందువల్లే మైదానంలోకి రావడాన్ని అతడు ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. మొత్తంగా ఒక సూపర్ సెంచరీ తర్వాత.. రెండు కీలకమైన మ్యాచులలో వైభవ్ సూర్యవంశీ ఆకట్టుకోలేకపోయాడు. అంచనాలు మొత్తం తలకిందులు చేసుకున్నాడు. విఫల ప్రదర్శనతో సునీల్ గవాస్కర్ తనపై చేసిన వ్యాఖ్యలను వైభవ్ సూర్యవంశీ నిజం చేసుకున్నాడు. ఇలాగే విఫల ప్రదర్శన సాగితే వైభవ్ సూర్యవంశీ కెరియర్ కోల్డ్ స్టోరేజ్ లోకి పోవడం ఖాయం. “వైభవ్ సూర్యవంశీ కనిపించని ఒత్తిడి ఉంది.. అతన్ని స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే విధంగా చూడాలి. అప్పుడే అతడి నుంచి నాణ్యమైన క్రికెట్ ఆశించవచ్చు. ఒకవేళ అతడు గనుక ఇలాగే ఇబ్బంది పడి క్రికెట్ ఆడితే మాత్రం అతి త్వరలో కెరియర్ అస్సాం చేరుకుంటుందని” క్రికెట్ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
A STUNNER FROM CAPTAIN RAHANE…!!! pic.twitter.com/ctv4IMMXQh
— Johns. (@CricCrazyJohns) May 4, 2025