KKR Vs RR IPL 2025: గత సీజన్లో రాజస్థాన్ జట్టు అదరగొట్టింది. ఒకానొక సందర్భంలో టేబుల్ టాపర్ గా అవతరించింది. ప్లే ఆఫ్ లో హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. లేకపోతే ఫైనల్ దాకా వెళ్ళేది. కానీ ఈ సీజన్లో ఆ స్థాయిలో ఆట తీరు ప్రదర్శించడం లేదు.. మెగా వేలంలో కీలకమైన ప్లేయర్లను కోల్పోయింది. కొత్తవాళ్లను తీసుకుంటే.. వారు సరిగ్గా ఆడటం లేదు. దీంతో రాజస్థాన్ జట్టు ఓటములు ఎదుర్కొక తప్పడం లేదు. ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు గెలుపుకు దగ్గరగా ఉన్న నాలుగు మ్యాచ్లలో ఓడిపోయింది. ఒకవేళ ఆ నాలుగు మ్యాచ్లు కనుక గెలిచి ఉంటే కచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ లో ఉండేది. దురదృష్టం కొద్దీ ఆ నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో గ్రూప్ దశ నుంచే రాజస్థాన్ బయటికి వెళ్లి పోవాల్సిన దుస్థితి నెలకొంది.
Also Read: అరేయ్ బుడ్డోడా.. ఇలాగైతే కెరియర్ అస్సాం చేరుకున్నట్టే..
ఓడిపోయినప్పటికీ..
రాజస్థాన్ జట్టు ఆదివారం కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు వ్యత్యాసంతో ఓటమిపాలైంది. కోల్ కతా విధించిన టార్గెట్ ను చేజ్ చేసేందుకు రాజస్థాన్ చివరి వరకు పోరాడింది. అయితే చివర్లో ఒక్క పరుగు వ్యత్యాసంతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రమే కాదు ఈ సీజన్లో లక్నో జట్టు పై రెండు పరుగులు తేడాతో రాజస్థాన్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 11 రన్స్ వ్యత్యాసంతో పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఇప్పుడిక కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై ఒక్క పరుగు తేడాతో ఓడిపోవలసి వచ్చింది. కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించకపోయినప్పటికీ.. రియాన్ పరాగ్ దాదాపు సెంచరీ వరకు వచ్చి అవుట్ అయ్యాడు. అతడు గనుక నిలబడి ఉంటే కచ్చితంగా రాజస్థాన్ గెలిచి ఉండేది. ఇక మిగతా ప్లేయర్ల నుంచి సరైన ఫినిషింగ్ రాకపోవడంతో.. రాజస్థాన్ జట్టు విజయాల ముందు బోల్తా పడుతున్నది. అయితే ఏ మ్యాచ్ ను కూడా రాజస్థాన్ జట్టు సులభంగా వదిలిపెట్టడం లేదు. వికెట్లు పడుతున్నప్పటికీ పోరాటాన్ని ఆపడం లేదు. అందువల్లే సోషల్ మీడియాలో రాజస్థాన్ జట్టు ప్లేయర్ల ఆటతీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ్యాచ్ లు ఓడిపోయినప్పటికీ మనసులు గెలుస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. ” రాజస్థాన్ గొప్పగా ఆడుతోంది. కాకపోతే మధ్యలో ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. ఓపెనర్ల విషయంలో వంక పెట్టడానికి అవకాశం లేదు. వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. మిగతా ప్లేయర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు. అందువల్లే రాజస్థాన్ జట్టు ఓటములు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఈ ఓటములు వరుసగా ఎదురుకోవడం వల్ల రాజస్థాన్ జట్టు గ్రూపు దశ నుంచే ఇంటికి వెళ్లి పోతున్నది. అదే కాస్త బాధగా ఉందని” రాజస్థాన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: యష్ దయాళ్..నాడు తిట్టారు.. నేడు హీరో అంటూ పొగుడుతున్నారు..