KKR vs PBKS : గంభీర్ బీపీ పేషంటా? మ్యాచ్ ఓడిపోతే ఇంత కోపమా? వైరల్ వీడియో

కానీ, డగ్ ఔట్ లో ఉన్న గౌతమ్ గంభీర్ అక్కడే ఉన్న ఫోర్త్ ఎంపైర్ వద్దకు వెళ్లిపోయాడు. ఫీల్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫోర్త్ ఎంపైర్ సరిగా స్పందించకపోవడంతో అక్కడి నుంచి పట్టరాని కోపంతో వెళ్లిపోయాడు.

Written By: NARESH, Updated On : April 27, 2024 8:02 pm

Mentor Gautam Gambhir lashed out

Follow us on

KKR vs PBKS : ఆటను ఆటలాగే చూడాలి. ఇందులో ఎటువంటి వ్యక్తిగత కోపాలకు, రాగద్వేషాలకు తావు ఉండకూడదు. ముఖ్యంగా జెంటిల్మెన్ గేమ్ లాంటి క్రికెట్లో ఇటువంటి వాటికి చోటు ఉండకూడదు. ఇలాంటి గేమ్ లో స్లెడ్జింగ్ కు పాల్పడినందుకు అండ్రు సైమాండ్స్ ఎలాంటి శిక్ష అనుభవించాడో అందరికీ తెలుసు. మంకీ గేట్ వివాదంలో కెరియర్ నే కోల్పోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలామంది ఉంటారు. ఇందులో భారతీయ క్రీడాకారులు దాదాపుగా ఉండరనే చెప్పొచ్చు. కానీ, శుక్రవారం నాటి కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ చూసిన తర్వాత.. ఈ జాబితాలోకి కోల్ కతా మెంటర్ గౌతమ్ గంభీర్ ను కూడా చేర్చొచ్చని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. గతంలో విరాట్ కోహ్లీతో గొడవపడి విమర్శల పాలైన గౌతమ్ గంభీర్.. ఇటీవల జరిగిన మ్యాచ్ లో పాత వివాదానికి ముగింపు పలికాడు. విరాట్ కోహ్లీ తో చేయి కలిపాడు. దీంతో గంభీర్ మారాడు, కోపాన్ని తగ్గించుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ, అది అబద్ధమని.. తన కోపం అలాగే ఉందని గంభీర్ నిరూపించాడు.

శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా భారీ స్కోరు సాధించింది. అయినప్పటికీ ఓడిపోయింది. కోల్ కతా నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు అత్యంత సునాయాసంగా ఛేదించింది. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. అంత భారీ స్కోరు సాధించినప్పటికీ ఓడిపోవడం పట్ల కోల్ కతా మెంటార్ గౌతమ్ గంభీర్ సహనాన్ని కోల్పోయాడు. ఫోర్త్ ఎంపైర్ తో గొడవకు దిగాడు.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో కోల్ కతా ముందుగా బ్యాటింగ్ చేసింది. సునీల్ నరైన్ 71, ఫిల్ సాల్ట్ 75 రన్స్ తో అదరగొట్టారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 261 రన్స్ చేసింది..కోల్ కతా ఇన్నింగ్స్ 14 ఓవర్లో గౌతమ్ గంభీర్ కు పట్టడానికి కోపం వచ్చింది. ఆ ఓవర్ ను పంజాబ్ స్పిన్ బౌలర్ రాహుల్ చాహర్ వేశాడు. ఆ బంతిని కోల్ కతా ఆటగాడు రస్సెల్ కవర్స్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ పంజాబ్ ఫీల్డర్ అశుతోష్ పట్టుకున్నాడు. కీపర్ జితేష్ శర్మకు త్రో వేశాడు. అది ఓవర్ త్రో కావడంతో రస్సెల్, వెంకటేష్ అయ్యర్ పరుగు తీశారు. ఈ పరుగును కోల్ కతా, రస్సెల్ ఖాతాలో వేసేందుకు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అనిల్ చౌదరి ఒప్పుకోలేదు. అశుతోష్ బంతిని అందుకున్న తర్వాత ఓవర్ పూర్తయినట్టు తాను చెప్పానని, ఓవర్ త్రో పరుగు పరిధిలోకి రాదని పేర్కొన్నాడు. అయితే మైదానంలో ఉన్న ఇద్దరు కోల్ కతా బ్యాటరు దీనిపై పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ, డగ్ ఔట్ లో ఉన్న గౌతమ్ గంభీర్ అక్కడే ఉన్న ఫోర్త్ ఎంపైర్ వద్దకు వెళ్లిపోయాడు. ఫీల్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫోర్త్ ఎంపైర్ సరిగా స్పందించకపోవడంతో అక్కడి నుంచి పట్టరాని కోపంతో వెళ్లిపోయాడు.