KKR Vs LSG IPL 2025: ఒకటే కొట్టుడు.. వీర కొట్టుడు.. నాటు కొట్టుడు.. దంచి కొట్టుడు.. ఉపమానాలు ఏవైనా సరే.. అంతిమంగా బంతి మాత్రం బౌండరీ లైన్ దాటింది. అయితే ఫోర్.. లేకుంటే సిక్సర్ అన్నట్టుగా వెళ్ళింది. అందువల్లే కోల్ కతా వేదికగా.. కోల్ కతా జట్టుపై లక్నో తాండవం చేస్తోంది. మార్ష్ దూకుడుతో స్కోర్ బోర్డు తుఫాన్ వేగంతో పరుగులు పెడుతోంది. తొలి వికెట్ కు మార్ష్(81*), మార్క్రం(47) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్ కు 99 పరుగులు జోడించారు. హర్షిత్ రాణా బౌలింగ్లో మార్క్రం అవుట్ అయ్యాడు. అతడు ఔటయ్యేప్పటికీ 48 పరుగులు.. ఇక ఆ తర్వాత అతడు తన జోరు పెంచాడు. వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. ఫలితంగా లక్నో జట్టు భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది. నికోలస్ పూరన్ తో కలిసి రెండో వికెట్ కు 30 బంతుల్లోనే 71 పరుగులు జోడించాడు. ఇప్పటివరకు లక్నో 200 పరుగులు దాటేసింది. ఈ సీజన్లో హైయెస్ట్ పరుగులు చేసే విధంగా లక్నో జట్టు కనిపిస్తోంది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకోవడమే అతడు చేసిన తప్పయింది. దీనిని సద్వినియోగం చేసుకున్న లక్నో ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 81 పరుగులు చేసిన మార్ష్ స్వల్ప రన్స్ తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. అప్పటికే చేయాల్సిన విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు.
Also Read: కింగ్ అని ఊరికే అంటారా.. ఆకాశ్ అంబానీ కూడా బిత్తర పోయాడు!
నాలుగు హాఫ్ సెంచరీలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మార్ష్ రెచ్చిపోతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు. 2010లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన మార్ష్.. 2024 వరకు 36 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇందులో అతడు 3 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. కానీ ప్రస్తుత సీజన్లో ఐదు ఇన్నింగ్స్ లలో నాలుగు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇక ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు మార్ష్ 265 పరుగులు చేశాడు. మార్ష్ 81 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ లక్నో జట్టు దూకుడు ఏమాత్రం తగ్గలేదు. మరో ఆటగాడు పూరన్ దంచి కొడుతున్నాడు. అతడు కూడా 27 బంతుల్లో ఇప్పటికే 60 పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా లక్నో జట్టు స్కోరు డబుల్ సెంచరీ దాటింది. చూడబోతే 250+ మార్క్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తారు రోడ్డు లాంటి పిచ్ పై లక్నో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు.
Also Read: శ్రేయస్ అయ్యర్ భయ్యో.. నీ పొలంలో మొలకలు వచ్చాయి.. ఇక పండగే పో..