https://oktelugu.com/

IPL 2021: కొదమ సింహాల్లా తలపడ్డ ఢిల్లీ, కోల్ కతా.. ఫైనల్ కు కేకేఆర్.. చెన్నైతో ఫైట్

IPL 2021: ఐపీఎల్ లో నిన్న జరిగిన సెమీస్ పోరు క్రికెట్ ఫ్యాన్స్ ను మునివేళ్లపై నిలబెట్టింది.మొదటి నుంచి కోల్ కతా మ్యాచ్ పై పట్టు బిగిస్తూనే ఉంది. చివరి 5 ఓవర్లు మాత్రం ఆట తలకిందులైంది. ఢిల్లీ రేసులోకి వచ్చేసింది. వరుసగా 5 బ్యాట్స్ మెన్ ను సున్నాకే ఔట్ చేసి గెలుపు ముంగిట నిలిచింది.కానీ కోల్ కతా బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిపాటి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన దశలో సిక్స్ కొట్టి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2021 / 10:32 AM IST
    Follow us on

    IPL 2021: ఐపీఎల్ లో నిన్న జరిగిన సెమీస్ పోరు క్రికెట్ ఫ్యాన్స్ ను మునివేళ్లపై నిలబెట్టింది.మొదటి నుంచి కోల్ కతా మ్యాచ్ పై పట్టు బిగిస్తూనే ఉంది. చివరి 5 ఓవర్లు మాత్రం ఆట తలకిందులైంది. ఢిల్లీ రేసులోకి వచ్చేసింది. వరుసగా 5 బ్యాట్స్ మెన్ ను సున్నాకే ఔట్ చేసి గెలుపు ముంగిట నిలిచింది.కానీ కోల్ కతా బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిపాటి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన దశలో సిక్స్ కొట్టి కోల్ కతాను ఫైనల్ చేర్చాడు. గెలుపు ధీమాతో ఉన్న ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు.

    చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఈజీగా గెలవాల్సిన దశలో వరుసగా ఐదుగురు బ్యాట్స్ మెన్ సున్నాకే డక్ ఔట్ అయ్యింది. పీకలదాకా తెచ్చుకున్నారు. ఢిల్లీని 136 పరుగులకే చాప చుట్టేసిన కోల్ కతా బౌలర్ల ఘనతకు.. కోల్ కతా ఓపెనర్లు ఏకంగా 90 పరుగులకు పైగా చేసి విజయం ముగింట నిలిపారు. కానీ ఓపెనర్లు ఔట్ అయ్యాకే అసలు కథ మొదలైంది. అప్పటివరకు అస్సలు సోధిలోనే లేని ఢిల్లీ విజృంభించింది. స్వల్ప వ్యవధిలోనే దినేశ్ కార్తిక్ 0, కెప్టెన్ మోర్గాన్ 0, షకీబ్ అల్ హసన్ 0, సునీల్ నరైన్ 0 ఇలా అందరూ ధాటిగా ఆడే క్రమంలో డక్ ఔట్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో చివరి ఓవర్ ఉత్కంఠగా మారింది. కోల్ కతాకు 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన దశలో అశ్విన్ బంతిని అందుకున్నాడు.

    వరుసగా వికెట్లు తీసి డిల్లీని గెలుపు ముంగిట నిలిపాడు. కానీ ఓవైపు అడ్డంగా నిలబడ్డ త్రిపాఠి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన దశలో 19.5 బంతిని సిక్సర్ గా మలిచి కోల్ కతాకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఏకంగా ఐపీఎల్ ఫైనల్ కు చేర్చాడు.

    ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయానికి ప్రధానంగా వారి బౌలింగ్ అద్భుతంగా సాగిందనే చెప్పాలి. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్, మావిలు ఢిల్లీ బ్యాట్స్ మెన్ ను కట్టిపడేశారు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యార్(55), గిల్ (46) ధాటిగా ఆడి కోల్ కతాను గెలుపు ముంగిట నిలిపారు. తర్వాత వరుసగా వికెట్లు పడడంతో ఢిల్లీకి ఊపు వచ్చింది. కానీ చివర్లో త్రిపాటి వారి ఆశలపై నీళ్లు చల్లి కోల్ కతాను ఫైనల్ చేర్చాడు. దసరా రోజు అక్టోబర్ 15న జరిగే ఫైనల్ లో చెన్నైతో కోల్ కతా తలపడనుంది.

    దూకుడుకు మారుపేరైన ఢిల్లీ కెప్టెన్ పంత్ సహా టీం అంతా ఈ మ్యాచ్ లో పరుగులు సాధించలేక చతికిలపడ్డారు. ఓటమి ముంగిట రిషబ్ పంత్ మొహంలో నెత్తురు చుక్క కనిపించలేదు. ఫస్ట్రేషన్ తో మొఖం వాడిపోయి కనిపించింది. ఫైనల్ చేరుస్తాడని భావించిన కెప్టెన్ పంత్ సామర్థ్యం సరిపోలేదు. మ్యాచ్ సెకండాఫ్ లో అతడి మొహంలో ఈ ప్రభావం కనిపించింది.