TPCC Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అధిష్టానం రేవంత్ రెడ్డిపై పలు ప్రశ్నలు సంధించింది. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలపై వివరణ అడిగారు. సామాజిక మాధ్యమాల్లో రేవంత్ ప్రజా దర్బార్ పేరుతో ప్రచారాలు నిర్వహించడంపై పలు అంశాలు లేవనెత్తారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సూచిందింది.

దీంతో దీనిపై రేవంత్ రెడ్డి ఆరా తీయగా పలు విషయాలు వెలుగు చూశాయి. ఆయన ప్రతిష్టను మసగబార్చే క్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కేంద్ర పెద్దలకు తనపై ఇంత దారుణంగా ఫిర్యాదు చేయడంతో ఆయనలో ఎంత పగ దాగి ఉందో ఇట్టే అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. అయినా సీనియర్లలో రేవంత్ రెడ్డిపై కోపం మాత్రం చల్లారడం లేదని తెలుస్తోంది.
వీటిపై కేంద్ర అదిష్టానం ఇంత సీరియస్ గా తీసుకుంటుందని రేవంత్ రెడ్డి భావించలేదు. కానీ వారు తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం. మళ్లీ ఇలాంటి వ్యవహారాలు తమ దృష్టికి వస్తే పరిస్థితి మరో లా ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. సామాజిక మాధ్యమాల్లో కూడా కాస్త నెమ్మదిగానే ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యతను గుర్తించాల్సి ఉంది.
Also Read: Huzurabad By-Election 2021: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేదెవరో తెలిసిపోయింది!
ఇప్పటికే సీనియర్లందరు జగ్గారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు రేవంత్ మాటలను విశ్వసించడం లేదు. ఆయన నాయకత్వాన్ని నమ్మడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది పార్టీకి మరింత నష్టం తెచ్చే విధంగా తయారవుతోంది. రేవంత్ రెడ్డి కూడా వారిని బుజ్జగించేందుకు శ్రద్ధ చూపడం లేదు. దీంతో పార్టీ మరిన్ని కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Also Read: KTR: కేసీఆర్ తప్పుకొని కేటీఆర్ కు బాధ్యతలు.. 25న ముహూర్తం?