https://oktelugu.com/

Manchirujulu Movie: ఆకట్టుకుంటున్న … మంచి రోజులు వచ్చాయి సినిమా ట్రైలర్ ?

Manchirujulu Movie: గోల్కొండ హైస్కూల్, పేపర్ బాయ్ , ఏక్ మినీ కథ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో సంతోష్ శోభన్. ఇప్పుడు తాజాగా మరో వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న” మంచి రోజులు ” వచ్చాయి సినిమాతో మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమాలో హీరో సంతోష్ కు జోడిగా మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 14, 2021 / 10:40 AM IST
    Follow us on

    Manchirujulu Movie: గోల్కొండ హైస్కూల్, పేపర్ బాయ్ , ఏక్ మినీ కథ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో సంతోష్ శోభన్. ఇప్పుడు తాజాగా మరో వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న” మంచి రోజులు ” వచ్చాయి సినిమాతో మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమాలో హీరో సంతోష్ కు జోడిగా మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది.

    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతో అలరించింది. కాగా ఇప్పుడు దసరా కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మై డియర్ వాట్సాప్ అంకుల్స్… యూట్యూబ్ ఆంటీస్ అంటూ మొదలైన ఈ సినిమా ట్రైలర్ మొదలైంది. మారుతి మార్క్ కామెడీతో ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏక్ మినీ కథ లాంటి కామెడీ ఎంటర్టైనర్ తరువాత సంతోష్ కు… ఇది మరో కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

    ఇక సినిమా లో వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి నటులు ఉండడంతో ఫుల్ లెన్త్ వినోదాత్మక చిత్రంగా సినిమా నిలవబోతుందని అర్థం అవుతోంది. హీరో హీరోయిన్ లు ప్రేమించుకోవడం ఆ తర్వాత హీరోయిన్ తండ్రి పడే పాట్ల నేపథ్యం లో సినిమా ఉండనుందని భావిస్తున్నారు. ఇక  ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన స్వరాలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా తో హీరో సంతోష్ శోభన్ కు మంచి రోజులు వస్తోయో లేదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.