https://oktelugu.com/

WTC Final : ఆ రికార్డులు బ్రేక్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ.!

ద్రవిడ్ (2,645) తొలి స్థానంలో ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభానికి ముందు వరకు విరాట్ కోహ్లీ 2574 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రెండు ఇన్నింగ్స్ ల్లో ఇప్పటి వరకు చేసిన పరుగులతో (2,632) కోహ్లీ అతి కొద్ది దూరంలో ఈ రికార్డు బ్రేక్ చేసేందుకు నిలిచి ఉన్నాడు.

Written By:
  • BS
  • , Updated On : June 11, 2023 / 12:31 PM IST
    Follow us on

    WTC Final : ఇండియన్ క్రికెట్ టీమ్ లో రన్ మెషిన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ తన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్న విరాట్ కోహ్లీ తాజాగా మరో అరుదైన రికార్డును సాధించాడు. సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డును తాజాగా జరుగుతున్న టెస్టుల్లో విరాట్ కోహ్లీ అధిగమించి తన పేరిట లిఖించుకున్నాడు.
    అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అతి తక్కువ వయసులోనే అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ లో రన్ మెషిన్ గా పేరుగాంచాడు విరాట్ కోహ్లీ. ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలో రాణిస్తూ జట్టుకు గొప్ప విజయాలను అందించడమే కాకుండా అనేక రికార్డులను సృష్టిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు.
    సచిన్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్..
    ఆస్ట్రేలియా జట్టుపై ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీల్లో నాకౌట్ దశలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియాపై సచిన్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు నాకౌట్ లో ఆస్ట్రేలియా జట్టుపై 657 పరుగులను చేసి రికార్డు నెలకొల్పాడు. తాజాగా విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ 44 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే నాకౌట్ దశలో ఆస్ట్రేలియా జట్టు పై 660 పరుగులు చేసినట్లు అయింది. దీంతో సచిన్ (557) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ (660) బ్రేక్ చేశాడు.
    ఐదో బ్యాటరుగా నిలిచిన విరాట్ కోహ్లీ..
    ఇక ఆస్ట్రేలియాపై టెస్టుల్లో టీమిండియా రన్ మెషిన్ కోహ్లీ 2000 పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత బ్యాటరుగా ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు జాబితాలో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ (3,630) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా, వీవీఎస్ లక్ష్మణ్ (2434) రెండో స్థానంలో, రాహుల్ ద్రవిడ్ (2143) మూడో స్థానంలో, పుజారా (2074) నాలుగో స్థానంలో ఉండగా కోహ్లీ 2037 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియాపై 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ తన పేరుతో రికార్డును సృష్టించుకున్నాడు. చిన్న వయసులోనే అనేక రికార్డులను నమోదు చేసుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరుగాంచాడు.
    రిచర్డ్స్ రికార్డును దాటేసే అవకాశం..
    ఇప్పటి వరకు కోహ్లీ 108 టెస్ట్ మ్యాచ్ ల్లో 8,416 పరుగులు చేశాడు. తాజా టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో 67 పరుగులు చేస్తే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న రికార్డును దాటేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిచర్డ్స్ పేరిట 8,416 పరుగులతో ఈ రికార్డు ఉంది. ఈ రికార్డుకు అతికొద్ది దూరంలోనే విరాట్ కోహ్లీ నిలిచి ఉన్నాడు.
    ఇంగ్లాండులో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడు..
    ఇంగ్లాండులో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో రాహుల్ ద్రవిడ్ (2,645) తొలి స్థానంలో ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభానికి ముందు వరకు విరాట్ కోహ్లీ 2574 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రెండు ఇన్నింగ్స్ ల్లో ఇప్పటి వరకు చేసిన పరుగులతో (2,632) కోహ్లీ అతి కొద్ది దూరంలో ఈ రికార్డు బ్రేక్ చేసేందుకు నిలిచి ఉన్నాడు.