Homeక్రీడలుక్రికెట్‌IND vs PAK: బాబర్ అజాం ను నమ్ముకుంటే.. అంతే సంగతులు..ఆ ఖుష్ దిల్ షా...

IND vs PAK: బాబర్ అజాం ను నమ్ముకుంటే.. అంతే సంగతులు..ఆ ఖుష్ దిల్ షా వంద రెట్లు నయం!

IND vs PAK : 2023 లో పాకిస్తాన్ దేశంలో జరిగిన ఆసియా కప్ టోర్నీ లో నేపాల్ జట్టుపై బాబర్ అజాం సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు అతడు మరో సెంచరీ చేయలేదు. పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాల్లో గత నాలుగేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2021లో ఇంగ్లాండ్ జట్టుపై అతడు తన చివరి సెంచరీ చేశాడు. ఫామ్ లో లేకపోయినప్పటికీ అతనికి జట్టులో అవకాశాలు లభిస్తున్నాయి. కొన్నిసార్లు కెప్టెన్ గా.. మరి కొన్నిసార్లు ఆటగాడిగా.. భిన్న రకాల ప్రయాణాన్ని బాబర్ అజాం చేయాల్సి వస్తోంది. అంతేతప్ప జట్టు మేనేజ్మెంట్ బాబర్ విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ పై పాకిస్తాన్ భారీగానే ఆశలు పెట్టుకుంది. 2017 నాటి మ్యాజిక్ కంటిన్యూ చేయాలని బలంగా నిర్ణయించుకుంది. కానీ బాబర్ ఆ స్థాయిలో ఆడటం లేదు. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో బాబర్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ తరహాలో ఆడాడు. 64 పరుగులు చేసినప్పటికీ దాదాపు 90 వరకు బంతులు ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ కు
జట్టు పాకిస్తాన్ కు ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఎదుట 321 రన్స్ టార్గెట్ విధించింది. కానీ ఆ లక్ష్యాన్ని చేదించడంలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. 260 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇదే మ్యాచ్ లో ఖుష్ దిల్ షా 69 పరుగులు చేశాడు. కేవలం 49 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ పరుగులు చేశాడు.. కానీ బాబర్ 64 పరుగులు చేయడానికి 90 బంతులు ఎదుర్కొన్నాడు. బాబర్ అజాం తో పోల్చితే ఖుష్ దిల్ షా కు అంతగా అనుభవం లేదు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతోంది కాబట్టి.. బాబర్ లాంటి ఆటగాడు కచ్చితంగా నిలబడాలి. కానీ అలాంటి చొరవ ఏమీ తీసుకోకుండా టెస్ట్ క్రికెట్ లాగా బ్యాటింగ్ చేశాడు.

టీమిండియా పై కూడా అదే

ఇక ప్రస్తుతం దుబాయ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో బాబర్ అదే తీరు కొనసాగించాడు. 26 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్ల సహాయంతో 23 పరుగులు చేశాడు. మొదట్లో కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. ఆ తర్వాత తేలిపోయాడు . హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ స్కోరు దారుణంగా పడిపోయింది. వాస్తవానికి బాబర్ భారత్ తో జరుగుతున్న మ్యాచ్లో బలమైన ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ భావించారు. కానీ అతడేమో ఇలా విఫలమయ్యాడు. బాబర్ 23 పరుగుల వద్ద అవుట్ కాగా.. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పదిపరుగులు మాత్రమే చేసి రన్ అవుట్ అయ్యాడు. ఇక న్యూజిలాండ్ పై ధాటిగా ఆడిన ఖుష్ దిల్ షా.. ఈ మ్యాచ్ లోనూ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ కథనం రాసే సమయానికి 21 బంతులు ఎదుర్కొని 20 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ కూడా ఉంది. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో ఖుష్ దిల్ షా నే తొలి సిక్సర్ కొట్టడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular