Kavyamaran : చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో కావ్య మారన్ తనలో ఉన్న మరో యాంగిల్ కూడా చూపించింది. ఇప్పటివరకు సౌమ్యురాలిగా.. మృదు స్వభావిగా కనిపించిన కావ్య.. తొలిసారిగా తనలో ఉన్న అపరకాళి అవతారాన్ని ప్రదర్శించింది. కోపంతో ఊగిపోయింది. పట్టలేని ఆగ్రహంతో హైదరాబాద్ ఆటగాళ్లను దాదాపు తిట్టినంత పని చేసింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.. దీంతో అభిమానులు కావ్య గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కావ్య అంటే బెల్లం జిలేబిలాగా మృతి స్వభావి అనుకున్నారా.. అప్పుడప్పుడు ఇలా మిర్చి బజ్జిలాగా మండిపడుతుంటుంది.. అంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read : సన్ రైజర్స్ కావ్య మారన్ స్టేడియంలో చేసిన ఈ పని వైరల్
రెండు సందర్భాల్లో కోపం
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఫిల్టర్ హర్షల్ పటేల్ క్యాచ్ మిస్ చేశాడు. దీంతో కావ్య మారన్ కు పట్టరాని కోపం వచ్చింది. చెన్నై ఇన్నింగ్స్ సమయంలో ఏడవ ఓవర్లో అన్సారీ బౌలింగ్లో సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా బంతిని గట్టిగా కొట్టాడు. అది అమాంతం గాల్లోకి లేచింది. సులభమైన ఆ క్యాచ్ ను హర్షల్ పటేల్ అందుకోలేకపోయాడు. సులభంగా అందుకోవాల్సిన ఆ క్యాచ్ ను మిస్ చేశాడు. దీంతో కావ్య ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.. “అరేయ్ పిచ్చోడా.. ఆ బంతిని కూడా అందుకోలేవా” అన్నట్టుగా తన హావభావాలను ప్రదర్శించింది. హర్షల్ పటేల్ వైపు చేతిని చూపిస్తూ బంగారం లాంటి క్యాచ్ మిస్ చేసావు కదా.. అన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది..
ఇక హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైకర్ గా మెండిస్ ఉన్నాడు. చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ బౌలింగ్ వేస్తున్నాడు. ఈ దశలో అతడు వేసిన బంతి నో బాల్ అని ఫీల్డ్ ఎంపైర్ ప్రకటించాడు. దీంతో హైదరాబాద్ జట్టుకు ఫ్రీ హిట్ లభించింది. ఈ దశలో ఆ బంతిని భారీ షాట్ కొట్టాల్సిన మెండిస్ మిస్ చేసుకున్నాడు. అప్పుడు కూడా కావ్య తనలో ఉన్న అసహనాన్ని బయటపెట్టింది.. ఓరయ్యా ఫ్రీ హిట్ కూడా కొట్టలేవా అన్నట్టుగా తన హావభావాలను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో హైదరాబాద్ అభిమానులు తెగ తిప్పుతున్నారు..” కావ్య అంటే అమాయకురాలు కాదు.. సివంగి.. ఇదిగో ఇలానే ఉంటుంది. తనకు కోపం వస్తే కాళీమాత లాగా రెచ్చిపోతుంది. ఇకనైనా హైదరాబాద్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి” అంటూ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ వచ్చే ఐదు మ్యాచ్లు గెలవకపోతే.. ఆటగాళ్లకు కావ్య మారన్ కచ్చితంగా సినిమా చూపిస్తుంది. దానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని..నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
The reaction of Kavya Maran was epic. pic.twitter.com/k3vvxuuOmt
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2025