AC and Fan : ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లదనం కోసం పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈ ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా ఉండకపోవడంతో సరైన గాలి రాదు. ఈ క్రమంలో చాలామంది కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఏసీలు ఏర్పాటు చేసుకునే వారు కొన్ని ప్రత్యేక సూచనలు పాటించడం వల్ల కరెంటు బిల్లు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫ్యాన్, కూలర్ కంటే ఏసీ వాడడం వల్ల ఎక్కువ పవర్ బిల్లు వస్తుంది. అయితే దీనిని తగ్గించుకునేందుకు చిన్నా టిప్స్ పాటించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. అదేంటంటే?
ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎంత ఏసీ ఏర్పాటు చేసుకున్న కూలింగ్ అవుతూ ఉండదు. అంతేకాకుండా గది పెద్దగా ఉండడంతో అంతటా చల్లదనం రాదు. ఈ క్రమంలో ఏసీ గాలి మరింత రావడానికి టెంపరేచర్ను తగ్గిస్తూ ఉంటారు. కానీ టెంపరేచర్ను తగ్గించడం వల్ల ఏసీ ఫై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో దీని జీవితకాలం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే టెంపరేచర్ను తగ్గించకుండా గది అంతటా చల్లదనం రావడానికి ఒక చిన్న పని చేయాలి.
Also Read : ఈ ఏసీ ఉంటే కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు.. రాత్రింబవళ్లు వాడినా నో ప్రాబ్లమ్!
ఏసీ వేసిన సమయంలోనే సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ ను ఆన్ చేసి ఉంచాలి. ఏసీ తో పాటు ఇది కూడా ఆన్ చేయడం వల్ల ఏసీ నుండి వచ్చే చల్లటి గాలి గది ఎంతట ప్రసరించేలా చేస్తుంది. కొంతమంది ఏసీ తో పాటు ఫ్యాన్ వేయడం వల్ల అధికంగా కరెంట్ బిల్లు వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఏసీ తో పాటు ఫ్యాన్ కూడా వేయడం వల్ల ఎంతో ఉపయోగకరమే అని సాంకేతిక నిపుణులు అంటున్నారు.
అయితే ఏసీ ఆన్ చేసిన సమయంలో ఈ ఫ్యాన్ తక్కువ స్పీడ్తో ఉండాలని అంటున్నారు. తక్కువ స్పీడ్ తో ఉండడం వల్ల ఏసి నుండి వచ్చే చల్లటి గాలిని గది అంతటికి వెళ్లేలా చేస్తుందని అంటున్నారు. ఇలా రూమ్ మొత్తం చల్లగా మారడంతో ఏసీ ఆటోమేటిగ్గా ఆటో మోడ్ లోకి మారిపోతుంది. దీంతో ఏసీ వాడకం తగ్గుతుంది. ఫలితంగా కరెంటు బిల్లు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏసీని ఆన్ చేసిన సమయంలో ఫ్యాన్ కూడా ఉండాలని చెబుతున్నారు. ఈ రెండు వాడకం వల్ల ఏసీ ఫై ఎక్కువగా ప్రభావం పడకుండా ఉండి ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
ఇక ఉష్ణోగ్రత ఎంత ఉన్న ఏసీ టెంపరేచర్ను 24 నుంచి 26 మధ్య మాత్రమే ఉంచాలని అంటున్నారు. టెంపరేచర్ను తగ్గించి కూలింగ్ ఎక్కువగా కావాలని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే స్థాయికి మించి తక్కువ టెంపరేచర్ను సెట్ చేయడం వల్ల ఏసీ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది అని నిపుణులు తెలుపుతున్నారు. గది ఆలస్యంగా కూలింగ్ అయినా 24 నుంచి 26 టెంపరేచర్ను మాత్రమే ఉంచుకోవాలని అంటున్నారు.
Also Read : ఏసీలో టన్ను అంటే బరువు కాదు.. దాని అసలు అర్థం తెలుసుకోండి!