Homeక్రీడలుక్రికెట్‌Kavya Maran : నవ్వుతుంటే చిన్నపిల్ల అనుకున్నారా.. ఆమె సృష్టించిన డైనోసార్ టీం ఇది..

Kavya Maran : నవ్వుతుంటే చిన్నపిల్ల అనుకున్నారా.. ఆమె సృష్టించిన డైనోసార్ టీం ఇది..

Kavya Maran  : ఈసారి సీజన్లో ఎలాగైనా సరే విజేతగా నిలవాలని హైదరాబాద్ జట్టు బలమైన ప్రణాళికలతో రంగంలోకి దిగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో పటిష్టంగా ఉండేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కావ్య మారన్(Kavya Maran). పైకి చూస్తే చిన్న పిల్లలాగా.. నవ్వుతూ, బిక్క ముఖం పెడుతూ, కన్నీరు కారుస్తూ దర్శనమిస్తూ ఉంటుంది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు గెలిచినప్పుడు ఎగిరి గంతులు వేసింది. జట్టు ఓడిపోయినప్పుడు విచారం వ్యక్తం చేసింది. చివరిగా ట్రోఫీని కోల్పోయినప్పుడు కన్నీరు పెట్టుకుంది. అయినప్పటికీ కావ్య జట్టుపై తన నమ్మకాన్ని కోల్పోలేదు. గత సీజన్లో ట్రోఫీకి వెంట్రుక వాసి దూరంలో నిలిచిపోయాం. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకూడదని కావ్య దృఢ నిశ్చయంతో రంగంలోకి దిగింది..

Also Read : రాజస్థాన్ కే కాదు మిగతా 8 జట్లకూ SRH హెచ్చరిక ఇది.

డైనోసార్ జట్టును సృష్టించింది

పూర్వకాలంలో అడవిలో డైనోసార్లు జీవించినప్పుడు.. ఇతర జంతువులు బతకడానికి అంతగా అవకాశం ఉండేది కాదు. అప్పట్లో డైనోసార్లు ఉన్నప్పుడు పులులు, సింహాలు, చిరుతపులులు, తోడేళ్లు, హైనాలు బిక్కుబిక్కుమంటూ జీవించే వట. ఎందుకంటే డైనోసార్ లు ఒక్కసారి ఎంట్రీ ఇస్తే అడవి మొత్తం దద్దరిల్లిపోయేదట. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కూడా డైనోసార్ మాదిరిగానే కావ్య మారన్ రూపొందించింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై జట్టు యాజమాన్యం వద్దనుకున్న ఆటగాడు ఇషాన్ కిషన్ ను కొనుగోలు చేసింది.. అతడు జట్టులోకి రావడంతో బలం మరింత పెరిగింది. ఆదివారం రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఏకంగా సెంచరీ చేశాడు. 18 వ ఎడిషన్ లో తొలిసారి చేసిన ఆటగాడిగా అతని రికార్డ్ సృష్టించాడు. ఇప్పటికే హైదరాబాద్ జట్టులో కమిన్స్(pat cummins), హెడ్(Travis head), అభిషేక్ శర్మ(Abhishek Sharma), నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), క్లాసెన్ వంటి వారిని కావ్య అంటిపెట్టుకొని ఉంది. వారితో ఏకంగా బలమైన కోర్ టీమ్ ను రూపొందించుకుంది. ఈ టీంకు మరింత బలం ఉండడానికి 11 కోట్లతో ఇషాన్ కిషన్(Ishan Kishan) ను కొనుగోలు చేసింది. ఆ సమయంలో కావ్య పై విమర్శలు వచ్చినప్పటికీ.. ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. అయితే ఆదివారం మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ చేయడం ద్వారా.. కావ్య టార్గెట్ ఏమిటో అందరికీ అర్థమైంది..” 0 పరుగులకు అవుట్ అయినప్పటికీ ఇబ్బంది లేదు. అప్రోచ్ మాత్రం తగ్గకూడదు. దూకుడు మంత్రాన్ని వదిలిపెట్టకూడదని” మేనేజ్మెంట్ పదేపదే చెప్పిందని.. అందువల్లే తను సెంచరీ చేశానని ఇషాన్ కిషన్(Ishan Kishan) వ్యాఖ్యానించాడంటే కావ్య పాప(Kavya maaran) ఈసారి ఎలాంటి ప్రణాళికను రూపొందించిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : నిజమే SRH నిప్పు కణం లాగానే ఆడింది.. గూస్ బంప్స్ వీడియో

 

View this post on Instagram

 

A post shared by (@_my_life_gallery_)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular