Kavya Maran: హైదరాబాద్ గెలుపుతో కావ్య సందడి.. ఇంతకీ ఆమె పక్కన ఎవరీ అమ్మాయి?

టాస్ గెలిచినప్పటికీ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టును 165 పరుగులకే పరిమితం చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 6, 2024 2:48 pm

Kavya Maran

Follow us on

Kavya Maran: గుజరాత్ జట్టుతో ఎదురైన ఓటమితో హైదరాబాద్ ఆటగాళ్లు ఒక్కసారిగా నిరాశలో కూరుకు పోయారు. ముంబై జట్టుపై 277 పరుగులు చేసిన తర్వాత.. గుజరాత్ జట్టుపై కూడా భారీ విజయాన్ని నమోదు చేస్తుందని హైదరాబాద్ ఆటగాళ్లు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నమ్మకాన్ని హైదరాబాద్ ఆటగాళ్లు వమ్ము చేశారు.. దీంతో సొంత మైదానం వేదికగా హైదరాబాద్ శుక్రవారం చెన్నై తో తలపడింది. ఈ మ్యాచ్ కు ముందు చాలామందికి హైదరాబాద్ జట్టుపై అంచనాలు లేవు. గెలుస్తుందనే ఆశలు లేవు. ఎందుకంటే గత ట్రాక్ రికార్డు కూడా చెన్నై జట్టుకే అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంచనాలు లేకుండానే హైదరాబాద్ జట్టు శుక్రవారం బలమైన చెన్నై తో తలపడింది.

టాస్ గెలిచినప్పటికీ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టును 165 పరుగులకే పరిమితం చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో అది చెన్నై స్కోర్ మీద ప్రభావం చూపించింది. స్వల్ప లక్ష్యం కావడంతో.. హైదరాబాద్ ఆటగాళ్లు జోరుగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హెడ్, మార్క్రమ్ ధాటికి హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సహజంగా హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తే.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ఎగిరి గంతేస్తుంది. ఆటగాళ్లు ఫోర్ కొట్టినా సంబరాలు చేసుకుంటుంది. సిక్స్ కొడితే ఆనంద డోలికల్లో మునిగి తేలుతుంది. కావ్య మైదానంలో ఉందంటే చాలు కచ్చితంగా కెమెరామెన్లు ఆమె వైపు ఫోకస్ చేస్తారు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించడంతో.. కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నపిల్లలాగా మైదానంలో ఆమె సందడి చేసింది. “గెలిచాం వావ్” అంటూ చప్పట్లు కొట్టుకుంటూ తన జట్టను అభినందించింది. కావ్య కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.

ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. 23 సంవత్సరాల ఈ యువ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 37 పరుగులు పిండుకున్నాడు. అతడు ఇన్నింగ్స్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు సులువుగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ సోదరి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ తో ఫోటో దిగింది. ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కావ్య తో ఫోటో దిగడంతో నెటిజన్లు ఎవరు ఈ అమ్మాయి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. కొందరు ఆమె సోదరిలా ఉందని కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో ఫిమేల్ మెంటర్ ను తీసుకొచ్చారేమో అంటూ వ్యాఖ్యానించారు. చివరికి ఆమె అభిషేక్ శర్మ సోదరి అని తెలియగానే నోరెళ్ళబెట్టారు..