spot_img
Homeక్రీడలుక్రికెట్‌Kavya Maran controversy: కావ్య మారన్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దమ్మా.. పునాదులు కదిలిపోతాయి

Kavya Maran controversy: కావ్య మారన్.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దమ్మా.. పునాదులు కదిలిపోతాయి

Kavya Maran controversy: క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టి ఉండవచ్చు. ఆస్ట్రేలియాలో అభివృద్ధి చెంది ఉండవచ్చు. కానీ గ్లోబల్ లో విపరీతమైన ప్రచారం లభించింది.. ఒక స్థాయిలో ఆదాయం వస్తోంది కేవలం ఇండియన్ మార్కెట్ నుంచే. అందువల్లే ప్రపంచ క్రికెట్లో ఇండియా డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అతిపెద్ద శ్రీమంతమైన బోర్డుగా కొనసాగుతోంది.

క్రికెట్ మీద ఐసిసి పెత్తనం సాగుతూ ఉండవచ్చు గాని.. ఐసీసీకి సింహభాగం ఆదాయం బీసీసీఐ అందిస్తోంది. బీసీసీఐ అందించే ఆదాయం ఆధారంగా క్రికెట్లో దాదాపు అన్ని క్రికెట్ బోర్డులు ఆర్థికంగా లాభ పడుతున్నాయి. బిసిసిఐ ఆస్తులు 20వేల కోట్లకు పైగా ఉంటే.. మిగతా అన్ని క్రికెట్ బోర్డుల ఆస్తులు కలిపినా కూడా ఆ స్థాయి లో లేవు. బిసిసిఐ ఐపీఎల్ ను 2008లో ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఐపీఎల్ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూనే ఉంది. ఏకంగా లక్ష కోట్లకు పైగా మార్కెటు వ్యాల్యూ ను సొంతం చేసుకుంది. మనదేశంలో గొప్ప గొప్ప కార్పొరేట్ వ్యక్తులు మొత్తం ఐపీఎల్లో జట్లను నిర్వహిస్తున్నారు.

ఐపీఎల్ లో ప్రముఖమైన జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఈ జట్టుకు యజమానిగా కావ్య మారన్ వ్యవహరిస్తున్నారు. కావ్య నాయకత్వంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు బలమైనదిగా ఎదిగింది. కావ్య హైదరాబాద్ జట్టును అనేక లీగ్ లలో ఆడిస్తోంది. అయితే కావ్య ది 100 క్రికెట్ లీగ్ టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్ అనే జట్టును ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కావ్య పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకుంది. ఇది భారత అభిమానులకు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగించింది.

మొన్నటి నుంచి నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఇదే అంశం గురించి విపరీతమైన చర్చ మొదలైంది. అభిమానుల దెబ్బకు హైదరాబాద్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మూసుకోవాల్సి వచ్చింది. ఓ నివేదిక ప్రకారం హైదరాబాద్ జట్టు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ బ్లాక్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కావ్య మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ జట్టు సిబ్బంది ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

అహ్మద్ విషయంలో భారత క్రికెట్ అభిమానుల నుంచి ఈ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుందని కావ్య ఏ మాత్రం అంచనా వేయలేదు. అహ్మద్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఇండియన్ అభిమానులు. పైగా తన ఆగ్రహాన్ని అనేక రూపాలలో ప్రదర్శించారు. చివరికి జరిగిన విషయంలో హైదరాబాద్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటువంటి పరిణామాలు జట్టు యాజమాన్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అహ్మద్ విషయంలో కావ్య ఎన్ని చెప్పినప్పటికీ భారత క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేరని.. క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper