Karun Nair Returns After 8 Years: ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు.. ఢిల్లీ జట్టు లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు కరుణ్ నాయర్. లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. లేటెస్ట్ గా పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఒకరకంగా మైదానంలో పరుగుల వరద పారించాడు. అతడి దూకుడు చూసి.. బీభత్సమైన బ్యాటింగ్ చూసి.. టీమిండియా మేనేజ్మెంట్ జాతీయ జట్టులో అవకాశం కల్పించింది. త్వరలో ఇంగ్లీష్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో అతడికి సముచిత ప్రాధాన్యం కల్పించింది. దీంతో అతడు ఇంగ్లీష్ గడ్డమీద ఆంగ్లజట్టుతో టెస్ట్ సిరీస్ ఆడటం లాంచనమే అని తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో నాయర్ అదరగొట్టాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు..
8 సంవత్సరాల తర్వాత..
జాతీయ జట్టులో 8 సంవత్సరాలు తర్వాత నాయర్ చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆంగ్ల గడ్డమీద ప్రాక్టీస్ చేశాడు. ఈ నేపథ్యంలో నాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.” సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ క్రికెటర్ నన్ను రిటైర్ అవమని సలహా ఇచ్చాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో సంబంధాలు తెంచుకుంటేనే విదేశాలలో నిర్వహించే టి20 లీగ్స్ లలో ఆడటానికి అవకాశం ఉంటుంది. భారత జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటిస్తే డబ్బు సంపాదించుకోవచ్చని ఆ ప్లేయర్ నాతో అన్నాడు. కానీ టార్గెట్ వదులుకున్నందుకు నన్ను నేను ఎప్పటికీ సమర్ధించుకోలేను. అందువల్లే జట్టులో ఆగమనం కోసం తీవ్రంగా ప్రయత్నించాను. దానికి తగ్గట్టుగానే కష్టపడ్డాను. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టులో ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ.. నా వంతుగా బ్యాటింగ్ చేశాను. జట్టు అవసరాలకు తగ్గట్టుగా పరుగులు చేశాను. తద్వారా నాలో పోరాట స్ఫూర్తిని మేనేజ్మెంట్ గుర్తించింది. అందువల్లే అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. జట్టు విజయంలో నేను కృషి చేస్తానని” కరుణ్ ప్రకటించాడు. కరుణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి..
సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి
కరుణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. జట్టులో ఉన్న పరిస్థితులను కరుణ్ బయట పెట్టాడని అంటున్నారు. ఆ కామెంటేటర్ ఎవరో చెప్తే బాగుండేదని.. అలాంటి వారి వల్లే వర్ధమాన ఆటగాళ్లు తమ కెరియర్ మొత్తాన్ని కోల్పోతున్నారని.. నెటిజన్లు మండిపడుతున్నారు. వర్ధమాన ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని.. అప్పుడే జట్టు వరుస విజయాలు సాధిస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.