https://oktelugu.com/

Sachin Tendulkar: కపిల్, సచిన్‌ స్ఫూర్తి.. మిగతా క్రికెటర్లలో ఎందుకు లేదు?

Sachin Tendulkar:కపిల్‌దేవ్‌.. క్రికెల్‌ లెజెండ్‌.. సచిన్‌ టెండుల్కర్‌ గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌. ఇదీ క్రికెట్‌ అభిమానుల్లో ఈ ఇద్దరి క్రికెటర్ల గురించి ఉన్న అభిప్రాయం. అభిమానులే కాదు.. సహచర క్రికెటర్లదీ అదే అభిప్రాయం. అటు క్రికెటర్లలో, ఇటు అభిమానుల మనసుల్లో ఇంతలా చోటు సంపాదించుకున్న క్రికెటర్‌ వేరే లేరు అంటే అతిశయోక్తి కాదు. వందల మంది క్రికెటర్లు టీం ఇండియా తరఫున ఆడారు. మరి ఈ ఇద్దరే ఎందుకు లెజెండ్, గాడ్‌ ఆఫ్‌ క్రికెటర్‌ అయ్యారు.. మిగతావారు […]

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 25, 2023 / 04:13 PM IST
    Follow us on

    Sachin Tendulkar:కపిల్‌దేవ్‌.. క్రికెల్‌ లెజెండ్‌.. సచిన్‌ టెండుల్కర్‌ గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌. ఇదీ క్రికెట్‌ అభిమానుల్లో ఈ ఇద్దరి క్రికెటర్ల గురించి ఉన్న అభిప్రాయం. అభిమానులే కాదు.. సహచర క్రికెటర్లదీ అదే అభిప్రాయం. అటు క్రికెటర్లలో, ఇటు అభిమానుల మనసుల్లో ఇంతలా చోటు సంపాదించుకున్న క్రికెటర్‌ వేరే లేరు అంటే అతిశయోక్తి కాదు. వందల మంది క్రికెటర్లు టీం ఇండియా తరఫున ఆడారు. మరి ఈ ఇద్దరే ఎందుకు లెజెండ్, గాడ్‌ ఆఫ్‌ క్రికెటర్‌ అయ్యారు.. మిగతావారు ఎందుకు అలాంటి ముద్ర వేసుకోలేకపోయారో చూద్దాం.

    ఆట.. కలుపుగోలు తనం..
    కపిల్‌దేవ్‌ 1970 దశకం క్రికెటర్‌.. దాదాపు రెండ దశాబ్దాలపాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు కపిల్‌దేవ్‌. కానీ ఎక్కడా ఆయనపై వివాదాలు లేవు. ఆటను ఆస్వాదించడం.. సహచరులను కలుపుకుపోవడం, అవసరమైతే సలహలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించడం ఇవే కపిల్‌కు తెలుసు. క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి మూడు దశాబ్దాలు కావొస్తున్నా ఇప్పటికీ ఆయన క్రికెట్లకు లెజెండే. అంతలా ఆయన తన సహచరులతో సాన్నిహిత్యం కొనసాగించాడు.

    సారథిగా సమష్టిగా..
    జటు పగ్గాలు చేపట్టగానే తమకేదో కొమ్ములు వచ్చినట్లు వ్యవహరిస్తున్న క్రీడాకారులు ఉన్న నేటి రోజుల్లో కపిల్‌దేవ్‌ మాత్రం తనదైన శైలిలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. జట్టును సమష్టిగా ముందుకు నడిపించాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే.. 1980వ దశకంలో కపిల్‌ సారథ్యంలో క్రికెట్‌ ఆడాలని నాటి తరం క్రికెటర్లు పైరవీలు కూడా చేసుకునేవారట. ఆయనతో ఆడితే ఆట నేర్చుకోవచ్చని, మంచి కెప్టెన్‌ సారథ్యంలో భారత జట్టుకు ఆడామన్న సంతృప్తి మిగులుతుందని భావించేవారట. అంటే కపిల్‌ సారథ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    క్రికెట్‌ ఐకాన్‌..
    1983లో భారత్‌కు ప్రపంచకప్‌లో అద్భుత విజయాన్ని అందించిన దేవ్, దేశపు గొప్ప ఆల్‌రౌండర్‌గా పరిగణించబడ్డాడు. ‘సునీల్‌ గవాస్కర్‌గా ఉండాలనుకోని వారు ఈ దేశంలో ఎవరూ ఉండరు. సునీల్‌కు ఆటలో అత్యున్నతమైన వాడు, చాలా మంది వస్తారు, కానీ ఈ పేరు (సునీల్‌) అగ్రస్థానంలో ఉంటుంది. మాకు ఆటపై అభిరుచి ఉంది, రివార్డులు మరియు అవార్డులు దేనికోసం వెతకలేదు. ఆ సమయంలో మాకు చాలా ప్యాషన్‌ ఉండేది. మాతో విజయం, ప్రజలు ఆనందాన్ని పొందినట్లయితే, మీరు దాని గురించి గర్వంగా భావిస్తారు. ఇప్పుడు క్రికెట్‌ మారిపోయిందని (మరియు) అది చాలా బాగుంది’ అంటాడు కపిల్‌. తాను క్రికెట్‌ ఐకాన్‌ ఐయినా సాదా క్రికెటర్‌గానే భావించడం కపిల్‌ గొప్పదనం.
    క్రికెట్‌ దేవుడు సచిన్‌..
    ఇక సచిన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్‌ క్రికెట్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. సచిన్‌కు ముందు.. సచిన్‌ వచ్చాక అని చెప్పుకోవాలి. 1990 వరకు ఒకలా ఉన్న క్రికెట్‌ రూపురేఖలు మార్చాడు సచిన్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది సచిన్‌ నైజం. క్రికెట్‌ దేవుడిగా ఎదిగిన సచిన్‌.. రిటైర్మెంట్‌ వరకూ ఇంకా నేర్చుకోవాలనే తప్ప ఉండేది. మరోవైపు సహచరులకు సహాయం చేయడం.

    వరల్డ్‌ క్రికెటర్లకూ స్ఫూర్తి..
    సచిన్‌ టీమిండియా క్రికెటర్లకే కాదు.. ప్రపంచంలోని చాలా మందికి స్ఫూర్తి. సచిన్‌లా ఆడాలి, సచిన్‌ నుంచి నేర్చుకోవాలని చాలా మంది క్రికెటర్లు ఆసక్తి చూపేవారు. సచిన్‌ను కలవడమే గొప్ప గౌరవంగా భావించేవారు. పరుగుల్లో ప్రపంచ రికార్డు సృష్టించినా సచిన్‌లో ఆ గర్వం ఏ కోశాన కనిపించదు. ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌లో ఒకడిగా కెరీర్‌ ముగించాడు. ‘సాంకేతికంగా ఎప్పటికీ సచినే బెస్ట్‌ బ్యాటర్‌ అని నేను చెబుతాను. అతన్ని కట్టడి చేయడానికి మేము ఎలాంటి ప్లాన్‌తో వచ్చినా అతని దగ్గర దానికి సమాధానం ఉండేది. అది ఇండియాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా. ఎవరు బెస్ట్‌ అనేది అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ప్లేయర్‌ ఆటను తమదైన రీతిలో ఆడతారు. కానీ నేను క్రికెట్‌ ఆడే సమయంలో మాత్రం సాంకేతికంగా సచినే గొప్ప బ్యాటర్‌‘ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, రికీ పాంటింగ్‌ స్పష్టం చేశాడు.

    ఎంతో మంది ఉన్నా..
    భారత జట్టుకు ప్రాతినిధ్యం, సారథ్యం వహించిన గొప్ప క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. గవాస్కర్, వాడేకర్, అజర్, సిద్దూ, అనిల్‌ కుంబ్లే, లక్ష్మణ్, గంగూలి, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ.. ఇలా ఎంతో మంది క్రికెటర్లు భారత జట్టులో గొప్ప క్రికెటర్లు. ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే.. కపిల్‌దేవ్, సచిన్‌లా మాత్రం ఎవరూ గుర్తింపు పొందలేకపోయారు. కపిల్, సచిన్‌తో ఆడిన క్రికెటర్లంతా తాముకూడా లెజెండ్రీగా భావిస్తారు. ఇక అభిమానుల గుండెల్లో అయితే ఈ ఇద్దరూ ఎప్పటికీ నిలిచిపోతారు. అందుకే వాలు క్రికెట్‌ ఐకాన్, క్రికెట్‌ గాడ్‌ అయ్యారు.