Upasana: రామ్ చరణ్ నట వారసత్వాన్ని నిలబెట్టే వారసుడు పుడుతున్నాడని సంబరాలు జరుపుకుంటున్న వేళ ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఉపాసనకు పుట్టేది అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దీనికి కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసన 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించడంతో బంధుమిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగింది. పదేళ్ల వరకు పిల్లల్ని కనకూడని నిర్ణయించుకున్న రామ్ చరణ్-ఉపాసన ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. అయితే ఈ పరిణామం మెగా అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.
ముందుగా అనుకున్నట్లు పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చారు. 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భవతి అయ్యారన్న విషయం బహిర్గతం చేశారు. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడన్న వార్త మెగా అభిమానులను సంతోషంలో ముంచేసింది. వారు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అయితే వారిని నిరాశపరిచే ఓ పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఉపాసనకు పుట్టేది అమ్మాయే, అందుకు ఆధారాలు ఇవే అని అంటున్నారు.
ఉపాసన-రామ్ చరణ్ ఇటీవల పలు ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పుట్టేది అమ్మాయే అన్నట్లు ఉన్నాయి. మాటల్లో మాటలో బిడ్డను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ ‘హర్'(ఆమె) అన్నారు. కాబట్టి రామ్ చరణ్ అభిప్రాయంలో ఉపాసన అమ్మాయి జన్మనిస్తారని కొందరి వాదన. అలాగే ఇటీవల జరిగిన ఉపాసన సీమంత ఫంక్షన్ డెకరేషన్ లో పింక్ హైలెట్ అయ్యింది. అదే థీమ్ లో వేదిక డెకరేట్ చేశారు. అలాగే ఉపాసన పింక్ కలర్ ఫ్రాక్ ధరించారు. పింక్ కలర్ గర్ల్ సింబల్. కాబట్టి ఇదొక హింట్ అంటున్నారు.
ఇక వారసత్వంగా చూసినా చిరంజీవి కుటుంబంలో ఎక్కువ మంది అమ్మాయిలు పుట్టారు. చిరంజీవికి మొదటి సంతానం అమ్మాయి సుస్మిత. తర్వాత రామ్ చరణ్. మూడో సంతానం శ్రీజా. సుస్మితకు ఇద్దరూ అమ్మాయిలే అని సమాచారం. శ్రీజా కూడా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఆ విధంగా చూస్తే రామ్ చరణ్ కి కూడా మొదటి సంతానంగా అమ్మాయి పుట్టే ఛాన్స్ కలదంటున్నారు. కాబట్టి ఉపాసన మొదటి సంతానంగా అమ్మాయికి జన్మనిస్తుంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో, ఊహాగానాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.