https://oktelugu.com/

IPL Mega Auction 2025: బెంగళూరు జట్టుపై.. మండిపడుతున్న కన్నడ అభిమానులు.. వారి ఆగ్రహానికి కారణమేంటంటే..

ఐపీఎల్ లో అత్యంత ప్రతిభావంతమైన జట్లలో బెంగళూరు ఒకటి. కానీ ఇంతవరకు ఐపీఎల్ కప్ సాధించలేదు. ఆ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఐపీఎల్ కప్ ను ఇప్పటివరకు సాధించలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 28, 2024 / 01:41 PM IST

    IPL Mega Auction 2025(9)

    Follow us on

    IPL Mega Auction 2025: ఇటీవల జరిగిన మెగా వేలంలో బెంగళూరు జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లపై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు యాజమాన్యం సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని.. అంతంతమాత్రంగా ఆడే ఆటగాళ్లతో ఐపీఎల్ కప్ ఎలా సాధిస్తుందని వారు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ఉమెన్స్ ఐపిఎల్ లో బెంగళూరు మహిళల జట్టు కప్ సాధించిందని.. కానీ పురుషుల జట్టు ఆ స్థాయి అందుకోలేకపోతుందని అభిమానులు మండిపడుతున్నారు. మెగా వేలం ముగిసినప్పటికీ.. కొత్త ఆటగాళ్లు చేరినప్పటికీ.. కన్నడ అభిమానుల ఆగ్రహం ఇంకా తగ్గలేదు. పైగా బెంగళూరు యాజమాన్యంపై వారు తీవ్రస్థాయిలో మండిపడిపోతున్నారు. ఇంతకీ వారి ఆగ్రహానికి కారణం ఏంటంటే..

    హిందీ బలవంతంగా రుద్దుతున్నారు..

    మెగా వేలం పూర్తయిన తర్వాత బెంగళూరు జట్టు హిందీలో ట్వీట్స్ చేస్తోంది. గతంలో ఎప్పుడు కూడా బెంగళూరు జట్టు ఇలా హిందీలో ట్వీట్స్ చేయలేదు. సహజంగానే కన్నడ ప్రజలకు తమ మాతృభాష మీద విపరీతమైన అభిమానం ఉంటుంది. కన్నడ భాషను వారు విపరీతంగా ప్రేమిస్తుంటారు. అయితే బెంగళూరు జట్టు హిందీలో ట్వీట్లు చేయడం కన్నడ అభిమానులకు నచ్చడం లేదు. అందువల్లేవారు తమ అగ్రహాన్ని బెంగళూరు జట్టుపై వ్యక్తం చేస్తున్నారు. ” మీకు హిందీ ఇష్టమైతే వేరే జట్టును చూసుకోండి. అంతే తప్ప మా భాషాభిమానాన్ని కించపరుస్తూ ట్వీట్లు చేయకండి.. మా కన్నడ ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మా కన్నడ భాషకు అద్భుతమైన సొగసు ఉంది. దానిని అపవిత్రం చేయకండి. మా భాషను గుర్తించినప్పుడు వేరే జట్టును చూసుకోవడం మంచిది. ఆ కన్నడను ప్రేమించే వారు మాత్రమే నూతన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును నిర్మిస్తారు.. ఐపీఎల్ లో విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తారు. మీ చేష్టలు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు మీరు కొత్త జట్టును చూసుకోండి. మా కన్నడను ఆరాధించేవారు మాకు దొరుకుతారంటూ” అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, మెగా వేలం పూర్తయిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికారిక ట్విట్టర్ ఐడిలో హిందీ ట్వీట్లు అధికంగా కనిపిస్తున్నాయి. ఇవి కన్నడ అభిమానుల మనసును గాయపరుస్తున్నాయి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కావాలని ఇలా చేస్తోందా? లేక దీని వెనుక మరో కారణం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కన్నడలోనే ఎక్కువగా ట్వీట్లు చేసేది. కానీ ఇప్పుడు అనూహ్యంగా హిందీలో ట్వీట్లు చేయడం కన్నడ అభిమానులకు రుచించడం లేదు.. అందువల్లే వారు తమ ఆగ్రహాన్ని ఇలా సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.