https://oktelugu.com/

Nellore Politics: నెల్లూరు కూటమిలో ఏం జరుగుతోంది.. సమ్ థింగ్ రాంగ్

వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది నెల్లూరు జిల్లా. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వైసిపి దారుణ పరాజయం చవిచూసిం ది. వైసీపీని విభేదించి పెద్ద ఎత్తున నేతలు టిడిపిలోకి వెళ్లడమే అందుకు కారణం. ఇప్పుడు అదే నేతలు అక్కడ టిడిపి సీనియర్లతో విభేదించడం ఆందోళన కలిగిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 28, 2024 / 01:37 PM IST

    Nellore Politics

    Follow us on

    Nellore Politics: నెల్లూరు తో పాటు రాయలసీమ జిల్లాల విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే వైసిపి కి ఎదురైన అనుభవాలే.. ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప్రధానంగా నెల్లూరులో ఇప్పుడు కూటమికి నేతలు ఎక్కువ. టిడిపిలో ఉన్న వారంతా సీనియర్లే. మంత్రిగా నారాయణ ఉన్నారు. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.మరో మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారు.ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.. ఇలా అంతా హేమాహేమీలే ఉన్నారు. అయితే ఇటీవల కూటమిలో విభేదాల పర్వంప్రారంభం అయినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది.అందరి పేర్లు పిలిచిన ఆర్డీవో ఒకరు ఎంపీ ని మర్చిపోయారు. దీంతో రుస రుసలాడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు వేంరెడ్డి. చివరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సముదాయించినా లాభం లేక పోయింది. మరోవైపు మంత్రి నారాయణ వర్సెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. నెల్లూరు సిటీ విషయంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అది ఎంతవరకు తీసుకెళ్తుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

    * వైసీపీలో తొలి తిరుగుబాటు నేత
    వైసిపి పై తొలిసారిగా వ్యతిరేకత వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు కోటంరెడ్డి. కానీ తనకు మరో రెండేళ్ల పదవి ఉండగానే వైసిపి నాయకత్వంతో విభేదించారు కోటంరెడ్డి. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో అస్త్రం అందించిన నేత కోటంరెడ్డి. ఈ ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ సమీకరణల దృష్ట్యా ఛాన్స్ దక్కలేదు. అయితే ఈ తరుణంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉన్న మంత్రి నారాయణతో కోటం రెడ్డికి విభేదాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థలో పన్నుల వసూలు విషయంలో మంత్రి నారాయణ నిర్ణయాన్ని కోటంరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కోటంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో కొంత భాగం కార్పొరేషన్ లో ఉంది. అందుకే పన్నుల వసూలును వ్యతిరేకిస్తున్నారు కోటంరెడ్డి. ఈ విషయంలో మంత్రి అయినా వ్యతిరేకిస్తానని తేల్చి చెప్పారు.

    మరోవైపు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గౌరవాన్ని వెతుక్కుంటూ టిడిపిలో చేరారు.తాను నెల్లూరు ఎంపీగా, భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. జిల్లాలో టిడిపి గెలుపునకు కృషి చేశారు. అయితే తన గౌరవానికి తగ్గట్టు టిడిపి నేతలు నడుచుకోవడం లేదన్న బాధ ఆయనలో ఉంది. చంద్రబాబు వరకు ఓకే కానీ జిల్లా స్థాయి నేతల తీరు బాగాలేదని ఆయన ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే వైసీపీ నుంచి గౌరవాన్ని వెతుక్కుంటూ నేతలు టిడిపిలోకి వచ్చారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటే మాత్రం వారు పునరాలోచనలో పడే అవకాశం ఉంది. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం నెల్లూరులో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది.