Kagiso Rabada : రబాడా ధాటికి బెంబేలెత్తిన బంగ్లాదేశ్.. ఆల్ టైం వరల్డ్ రికార్డ్ సృష్టించిన దక్షిణాఫ్రికా బౌలర్

పాకిస్తాన్ జట్టుపై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. భారత్ పై మాత్రం 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 21, 2024 3:48 pm

Kagiso Rabada

Follow us on

Kagiso Rabada : ఢాకా వేదికగా తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సూపర్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం ను ఔట్ చేసి.. టెస్టులలో 300 వికెట్లు దక్కించుకున్న బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో అతడు ప్రపంచ ఘనతను నమోదు చేసుకున్నారు. బత్తలపరంగా చూస్తుంటే టెస్ట్ క్రికెట్ ఫార్మేట్ లో అత్యంత వేగంగా మూడు వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ బౌలర్ వకార్ యూనిస్ పేరు మీద ఉండేది. వకార్ 12,602 అందులో 300 వికెట్ల మార్క్ అందుకోగా.. రబాడా 11,817 బంతుల్లోనే 300 క్రికెట్లను సాధించాడు. రబాడా, యూనిస్ తర్వాత స్థానాలలో డేల్ స్టెయిన్ (సౌత్ ఆఫ్రికా -12,605), అలెన్ డొనాల్డ్(సౌత్ ఆఫ్రికా – 13672) ఉన్నారు.

మూడో ఫాస్ట్ బౌలర్ గా..

దక్షిణాఫ్రికా జట్టు తరఫున వేగంగా టెస్టులలో 300 వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా రబాడా రికార్డు సృష్టించాడు. అంతకంటే ముందు స్టెయిన్, డొనాల్డ్ ఈ ఘనతను అందుకున్నారు. మ్యాచ్ ల పరంగా చూసుకుంటే 300 వికెట్ల మార్క్ ను స్టెయిన్(61), డొనాల్డ్(63) అందుకోగలిగారు. రబాడ 65 మ్యాచ్ లలో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. కొత్తగా చూస్తే సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున అత్యధికంగా టికెట్లు పడగొట్టిన ఆరవ బౌలర్ గా రబాడా సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 38 బౌలర్లు 300 వికెట్లు పడగొట్టారు. వీరందరికంటే రబాడా మెరుగైన స్ట్రైక్ రేట్ సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ ప్రస్తుతం 39.3 గా ఉంది. అతని తర్వాతి స్థానంలో డెల్ స్టెయిన్ 42.3 సగటుతో కొనసాగుతున్నాడు. ఈ ప్రకారం చూసుకుంటే ప్రతి 39 బాల్స్ కు రబాడా ఒక వికెట్ సాధిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఢాకా మ్యాచ్ ను ఒకసారి పరిశీలిస్తే సౌత్ ఆఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లా 106 పరుగులకే కుప్పకూలింది. హసన్ జాయ్ 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రబాడా, కేశవ్ మహారాజ్, వియాన్ ముల్డర్ తలా మూడు వికెట్లు సాధించారు. డెన్ పీడ్ట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. జట్టు స్కోర్ ఆరు పరుగుల వద్ద ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం రూపంలో తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టు.. ఏ దశలోనూ సౌత్ ఆఫ్రికా బౌలర్లను నిలవరించలేకపోయింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా మెరుగైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.. దీంతో దక్షిణాఫ్రికా బౌలర్లు పండగ చేసుకున్నారు.