Revanth Reddy: రేవంత్ రెడ్డి చేసిన ఓ మంచి పని.. ఇలా ఎవరూ ఆలోచించలేదు

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా నిలిచారు. ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి రివార్డులు అందజేశారు. మరో ఇద్దరికి డీఎస్పీలుగా ఉద్యోగాలు కల్పించారు. గత ప్రభుత్వంలో పద్మ అవార్డు పొందిన మొగిలయ్యకు సైతం రేవంత్ సర్కార్ స్థలాన్ని అందించింది.

Written By: Srinivas, Updated On : October 21, 2024 3:52 pm

Revanth-Reddy

Follow us on

Revanth Reddy: పది నెలల క్రితం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అన్నివర్గాల సంతృప్తి పరుస్తూ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఎవరు ఏం అడిగినా.. వాటి మీద స్టడీ చేసి.. సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దు అని చెప్పినట్లుగానే పాలనలో దూసుకెళ్తున్నారు. ఓ వైపు యూత్ కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీలు.. విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీలు.. నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు కల్పిస్తూ వావ్ అనిపిస్తున్నారు. ఇప్పటికే పోలీసు ఉద్యోగాలు, వైద్య శాఖలో కొలువులు, టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించారు. ముందుముందు మరిన్ని జాబ్స్ ఇవ్వబోతున్నారు.

అలాగే.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా నిలిచారు. ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి రివార్డులు అందజేశారు. మరో ఇద్దరికి డీఎస్పీలుగా ఉద్యోగాలు కల్పించారు. గత ప్రభుత్వంలో పద్మ అవార్డు పొందిన మొగిలయ్యకు సైతం రేవంత్ సర్కార్ స్థలాన్ని అందించింది. కాగా.. తాజాగా పోలీసుల అమలరవీరుల కుటుంబాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళి అర్పిస్తూనే.. వారి కుటుంబాలకు పెద్ద భరోసా కల్పించారు. అమరులైన కుటుంబాలకు రూ.కోటి, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు అని.. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంతోపాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో ముందుంటారని కొనియాడారు. అందులో భాగంగానే అమరవీరుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. కానిస్టేబుల్, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి, ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే.. శాశ్వత వైకల్యం పొందిన వారికీ పరిహారం ఇస్తామని చెప్పారు.

దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉంటున్నారని, రాత్రిళ్లు హాయిగా నిద్ర పోతున్నారంటే అందుకు పోలీసులే కారణమని చెప్పుకొచ్చారు. అమరులైన కుటుంబాలను తలచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. డ్రగ్స్, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీసులు ఒకరి చేయి ముందు చేయి చాచకుూడదని, తమ ప్రభుత్వం అలా చూసుకుంటుందని, హూందాగా ఉండాలని పిలుపునిచ్చారు. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండాలని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే అకాడమీ ఇయర్ నుంచి స్కూల్ ప్రారంభం అవుతుందని తెలిపారు. పోలీసులకు ఎలాంటి సమస్యలున్నా తన వద్దకు వచ్చి చెప్పుకుంటే పరిష్కరిస్తానని అన్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో అమరవీరుల కుటుంబాల్లో సంతోషం కనిపించింది.