Flipkart Big Diwali Sale:దీపావళి వేడుకలతో పాటు ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం అనేక గొప్ప ఆఫర్‌లను కూడా తీసుకువచ్చింది. బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 21 నుండి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈరోజు నుండి ఈ సేల్ ప్రారంభమైంది. మీకు ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యత్వం లేకపోయినా, మీరు భారీ తగ్గింపు ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రముఖ ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే అనేక వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త వాషింగ్ మెషీన్ ధర రూ.5,099 నుంచి ప్రారంభమవుతుంది. మీరు కొత్త వాషింగ్ మెషీన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లను ఉపయోగించుకోవచ్చు. వాషింగ్ మెషీన్లపై మీకోసం ఐదు బెస్ట్ వాషింగ్ మెషీన్ల ఆఫర్ల గురించి తెలుసుకుందాం. వాటిపై కనీసం 50 శాతం తగ్గింపు లభిస్తుంది. వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయడంలో పెద్ద మొత్తంలో ఆదా చేయడానికి ఈ వాషింగ్ మెషీన్ ఆఫర్‌లేంటో చూద్దాం.
MarQ 8 కిలోల వాషింగ్ మెషిన్
ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ. 12,000 అయితే మీరు దీన్ని 57 శాతం తగ్గింపుతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత, ఈ వాషింగ్ మెషీన్ కేవలం రూ. 5,099కి అందుబాటులో ఉంటుంది. ఈ వాషింగ్ మెషీన్ 8 కిలోల బట్టలు ఉతకగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
టీసీఎల్ 7 కిలోల 5 స్టార్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్
ఈ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేస్తే మీకు 51 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో దీని అసలు ధర రూ. 15,490, కానీ మీరు దీన్ని కేవలం రూ. 7,568కి కొనుగోలు చేయవచ్చు. ఈ వాషింగ్ మెషీన్‌కు 7 కేజీల బట్టలు ఉతకగలిగే సామర్థ్యం ఉంది. ఇది శక్తివంతమైన మోటార్, లింట్ ఫిల్టర్‌ను కలిగి ఉంది.
ఇంటెక్స్ 6.5కేజీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్
ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.23,999. కానీ కేవలం రూ.10,290కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ వాషింగ్ మెషీన్‌పై 57 శాతం తగ్గింపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది 6.5 కేజీల బట్టలు ఉతకగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మిషీన్ పూర్తిగా ఆటోమేటిక్.
రియల్ మీ టెక్ లైఫ్ 7కిలోల 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్
ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.21,990. ఫ్లిప్‌కార్ట్ 50 శాతం తగ్గింపుతో విక్రయిస్తోంది. దీపావళి రోజున రూ.10,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ 7 కిలోల లాండ్రీ సామర్థ్యంతో వస్తుంది. 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.
వోల్టాస్ బెకో 8.5 కేజీ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్
ఈ వాషింగ్ మెషీన్‌ను రూ.22,990కి బదులుగా రూ.11,290కే కొనుగోలు చేయవచ్చు. దీన్ని కొనుగోలు చేస్తే మీకు 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ 8.5కేజీల బట్టలు ఉతికే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సెమీ ఆటోమేటిక్.
ఈ వాషింగ్ మెషీన్ ఆఫర్లన్నీ మీకు చాలా ఆదా చేయడంలో సహాయపడతాయి. మీరు కొత్త గృహోపకరణాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ యొక్క డీల్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.