Sumit Nagal : మనదేశంలో క్రికెట్ కి ఉన్న గుర్తింపు మిగిలిన ఏ ఆటలకి లేదు. ఫంక్షన్ విషయంలో కూడా క్రికెట్ ప్లేయర్స్ చూపించిన దాంట్లో చూపించడం కష్టం అని చెప్పాలి. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు భారతదేశం నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్. ఏటీపీ టూర్ లో అతను కొనసాగించడం కోసం కోటి రూపాయల జీవనోపాధి ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం అతని ఖాతాలో లక్ష కంటే తక్కువ బ్యాలెన్స్ మిగిలి ఉంది.జర్మనీలోని నాన్సెల్ టెన్నిస్ అకాడమీలో కొన్ని సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్న అతను నిధుల కొరత కారణంగా సీజన్ 2023లో మొదటి మూడు నెలలు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు.
ప్రపంచ కప్ లో ఆడడం అనేది ప్రతి టెన్నిస్ ఆటగాడి డ్రీమ్…అయితే మన దేశానికి సంబంధించిన నెంబర్ వన్ సింగిల్స్ ఆటగాడు మాత్రం ప్రస్తుతం తన కనీస అవసరాల కోసం ఎదురుచూసే పరిస్థితుల్లో ఉన్నాడు. జర్మనీలో అతని ప్రాక్టీస్ కోసం మొదటి రెండు నెలలు అతని ఫ్రెండ్స్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్,క్రిస్టోఫర్ మార్క్విస్ హెల్ప్ చేశారు అంటే అతను ఏ స్థితిలో ఉన్నాడో మీరే అర్థం చేసుకోండి. ఈనాడు క్రికెట్ మినహా మిగిలిన అన్ని స్పోర్ట్స్ కి సంబంధించిన ఆటగాళ్లు తమ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఒంటరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇది కేవలం మన ఇండియాలో మాత్రమే ఉండడం గమనార్హం.
ఈరోజు ఏటీపీ టూర్ లో ఉండడం కోసం నాగల్ తనకు వచ్చిన ప్రైజ్ మనీ తో పాటు ఇప్పటివరకు వచ్చిన జీతంతో , టెన్నిస్ ఫౌండేషన్ నుంచి లభించిన మద్దతు మొత్తాన్ని కూడా పెట్టుబడిగా పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక మెరుగైన శిక్షణ కోసం, కోచ్ ఫిజియో తో పాటు టోర్నమెంట్ ల కోసం అతను ఈ మొత్తం ఖర్చును పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన బ్యాంకు బాలన్స్ గురించి మాట్లాడుతూ అతను ఇలా అన్నాడు.. ప్రస్తుతం నా బ్యాంకులో కేవలం 900 యూరోలు అంటే మన ఇండియన్ కరెన్సీ లో సుమారు 80 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉంది. నా కోచింగ్ కి సంబంధించిన విషయాల్లో మహా టెన్నిస్ ఫౌండేషన్ మిస్టర్ ప్రశాంత్ సుతార్ నాకు ఎంతో సహాయం చేశారు. కానీ నాకు పెద్దగా స్పాన్సర్ ఎవరూ లేకపోవడంతో కాస్త కష్టంగా ఉంది అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగల్ చెప్పారు.
నాగల్ యొక్క రాకెట్, బూట్లు , దుస్తులు లాంటి అవసరాలను ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్స్ యోనెక్స్ ,ASICS చూసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ఆడిన 24 టోర్నమెంట్‌లలో, నాగల్ యుఎస్ ఓపెన్ నుండి వచ్చిన అతిపెద్ద పే చెక్‌తో దాదాపు 65 లక్షలు సంపాదించాడు. అయితే అతనికి కోచ్ నిమిత్తం దాదాపు 80 లక్షల నుండి 1 కోటి వరకు ఖర్చవుతుంది. గత కొన్నేళ్లుగా భారత్‌లో నంబర్ వన్ ప్లేయర్‌గా ఉన్నప్పటికీ నాగల్ తనకు మద్దతు కరువైనట్లు భావిస్తున్నాడు.
ఇప్పటివరకూ గ్రాండ్‌స్లామ్‌లకు అర్హత సాధించిన ఏకైక ఆటగాడు నాగల్ ఒకడే .. అయినా ఇంకా మన ప్రభుత్వం అతని పేరును TOPSలో చేర్చలేదు. ఇదే పరిస్థితి ఒక క్రికెట్ ప్లేయర్ ఎదుర్కొన్నట్లయితే ప్రభుత్వంతో పాటు అతనికి స్పాన్సర్షిప్ ఇవ్వడం కోసం ఎన్నో కంపెనీలు పోటీ పడేవి. ఏమీ లేకుండా క్రికెట్ ఫీల్డ్ లోకి ఎంటర్ కోట్లు గడించిన ప్లేయర్స్ ని మనం చూస్తున్నాం కానీ ఇలా మ్యాచ్ ఆడడం కోసం కూడా కష్టపడే ప్లేయర్స్ నువ్వు కేవలం మిగిలిన ఆటల్లో మాత్రమే చూస్తున్నాం. ఇది నిజంగా మార్పు తేవలసిన విషయం అని గవర్నమెంట్ గుర్తించాలి.