Homeక్రీడలుMS Dhoni Champions Trophy: 2013.. ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ.. ఇప్పటికీ ఒక్కటి...

MS Dhoni Champions Trophy: 2013.. ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ.. ఇప్పటికీ ఒక్కటి దిక్కులేదు

MS Dhoni Champions Trophy: క్రికెట్ లో ఏ జట్టుకైనా ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలను అంతిమ లక్ష్యం. కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న భారత జట్టు మాత్రం ఐసిసి టోర్నీలను అతి తక్కువ మాత్రమే గెలుచుకుంది. రెండు వన్డే వరల్డ్ కప్ లు, ఒక టి20 వరల్డ్ కప్, మరో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని భారత జట్టు ముద్దాడింది. చివరిసారిగా పదేళ్ల కిందట 2013లో ఛాంపియన్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత జట్టు.. ఇప్పటివరకు మరో ఐసీసీ ట్రోఫీని నెగ్గ లేక పోయింది.

టీమిండియా ఐసీసీ ట్రోఫీ సాధించి పదేళ్లు కావస్తోంది. ధోని సారథ్యంలోని భారత జట్టు 2013లో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. ఆ తరువాత జరిగిన అనేక ఐసీసీ ట్రోఫీలో భారత జట్టు బోల్తాపడుతూ వస్తోంది. 2013లో సొంత మైదానంలోనే ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించి ఛాంపియన్స్ ట్రోఫీను ఒడిసి పట్టింది భారత జట్టు. పదేళ్లుగా మరో ఐసీసీ ట్రోఫీ కోసం భారత జట్టు నిరీక్షిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు.

థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసిన భారత జట్టు..

2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఇంగ్లాండ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్యమే అయినప్పటికీ ఇంగ్లాండు జట్టును అద్భుతంగా కట్టడి చేసింది టీమిండియా. చివర బంతి వరకు పోరాడి మరి భారత జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. అప్పటి యువ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33), శిఖర్ ధావన్ (31) రాణించడంతో నామమాత్రపు స్కోరును చేయగలిగింది ఇండియా జట్టు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోని డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. విరాట్ కోహ్లీ, జడేజా ఆరో వికెట్ కు 47 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత జట్టు 129 పరుగులు చేయగలిగింది. 130 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు జట్టును భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి కట్టడి చేశారు. భారత బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంగ్లాండ్ జట్టును తొలి దెబ్బతీశాడు. కుక్ ను అవుట్ చేసి భారత జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తరువాత అశ్విన్, జడేజా, ఇశాంత్ శర్మ స్వల్ప విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెంచారు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా, అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తొమ్మిది పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఇంగ్లాండు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 124 పరుగులకు పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు అయిదు పరుగులు తేడాతో ఓటమిపాలైంది.

మునివేళ్లపై నిలబడిన అభిమానులు..

ఈ మ్యాచ్ ఫలితం కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడడంతో అభిమానులు మునివేళ్లపై నిలబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు బౌలర్ల అద్భుత పోరాటంతో ఐదు పరుగులు తేడాతో విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ విజయం సాధించి పదేళ్లు కావస్తుంది. ఇప్పటివరకు మరో ఐసీసీ ట్రోఫీని భారత జట్టు గెలుచుకోలేకపోవడం అభిమానులను బాధిస్తోంది. 2013 తర్వాత భారత జట్టు 2015, 2019 ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరినప్పటికీ కప్పు సాధించడంలో విఫలమైంది. అలాగే రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లిన విజేతగా నిలవలేక చేతులెత్తేసింది. దీంతో అభిమానులు మరో ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీ కోసం ఆశగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మరోసారి వన్డే వరల్డ్ కప్ జరగనుంది. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ ను సాధించి అయినా అభిమానుల ఆశ తీర్చాలని భారత జట్టు భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular