Jonny Bairstow: బలమైన కోల్ కతా జట్టు సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్ లో శుక్రవారం రాత్రి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్లే ఆప్స్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ను.. పంజాబ్ చేజిక్కించుకుంది.. 261 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో పంజాబ్ ఆటగాడు బెయిర్ స్టో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బాల్స్ లోనే 108 రన్స్ చేశాడు. ఫలితంగా పంజాబ్ జట్టు రికార్డు స్థాయి లక్ష్యాన్ని చేదించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు ఇది మూడో విజయం. అంతేకాదు ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన విజయం. ఈ టార్గెట్ చేజ్ చేయడం ద్వారా పంజాబ్ జట్టు సరికొత్త ఘనతను సాధించింది
పంజాబ్ జట్టు తరఫున జానీ బెయిర్ స్టో కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్స్ ల సహాయంతో 108 రన్స్ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్లో అతడు ఆ స్థాయిలో ఆడకుండా ఉండి ఉంటే.. పంజాబ్ జట్టు గెలిచి ఉండేది కాదు. మిగతా ఆటగాళ్లు అతనికి సహకరించడంతో పంజాబ్ జట్టు గెలుపు సులభతరం అయిపోయింది. పంజాబ్ జట్టు గెలిచిన అనంతరం అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ కంటే ముందు అతడు గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన దాఖలాలు లేవు. వరుస ఓటమిలో ఎదుర్కొంటున్న పంజాబ్ జట్టుకు ఆపద్బాంధవుడిగా ఉండాల్సింది పోయి..ఎక్స్ ట్రా ఫింగర్ మాదిరి ఇబ్బంది పెడుతున్నాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన జానీ బెయిర్ స్టో.. 204 రన్స్ చేశాడు. అందులో శుక్రవారం రాత్రి కోల్ కతా జట్టు పై 108 రన్స్ చేశాడు. అంటే మిగిలిన ఆరు మ్యాచ్లలో అతడు చేసిన పరుగులు కేవలం 96 మాత్రమే.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతడు తన ఫామ్ అందుకున్నాడు. అదికూడా టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. సెంచరీ కొట్టాడు. మ్యాచ్ చివరి వరకు స్థిరంగా నిలబడ్డాడు. ఇన్ని రోజులు సరిగా ఆడకపోవడంతో చాలామంది నుంచి అతడు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒక్కసారిగా తన పూర్వపు లయను అందుకోవడంతో ఉద్వేగానికి గురయ్యాడు. మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా కోల్ కతా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 261 రన్స్ చేసింది. ఫిలిప్స్ సాల్ట్ 75, సునీల్ నరైన్ 71, వెంకటేష్ అయ్యర్ 39, రస్సెల్ 24, శ్రేయస్ అయ్యర్ 28 రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్లు అర్ష దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు. సామ్ కరణ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. పంజాబ్ 262 రన్స్ టార్గెట్ ను 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి సాధించింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 54, జానీ బెయిర్ స్టో 108, రొసౌ 26, శశాంక్ 68 రన్స్ చేసి పంజాబ్ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు.
Jonny Bairstow in tears after scoring the match-winning 100 in a world record chase #IPL2024 #tapmad #HojaoADFree pic.twitter.com/OCtpAhF5dd
— Farid Khan (@_FaridKhan) April 26, 2024