Mowgli Day 2 Collections: ప్రముఖ యాంకర్ సుమ(Suma Kanakala) తనయుడు, రోషన్(Roshan Kanakala) హీరో గా, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘మోగ్లీ'(Mowgli Movie) చిత్రం రీసెంట్ గానే విడుదలై ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఒక డిఫరెంట్ ప్రయత్నం తో ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడని, ఇంకా కాస్త గొప్పగా తీయొచ్చు కానీ, మొదటి చిత్రం తో పోలిస్తే చాలా వరకు బెటర్ గా తెరకెక్కించాడని చూసిన ఆడియన్స్ అంటున్నారు. ఇకపోతే హీరో రోషన్ నటనకు కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నటనతో పాటు ఫైట్లు కూడా అదరగొట్టేసాడని, కుర్రాడిలో మంచి టాలెంట్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన రోజే నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2′ కూడా విడుదలైంది. భారీ హైప్ ఉన్న సినిమాకు పోటీ గా వస్తుంది , కనీసం థియేటర్స్ కూడా దొరకవని అంతా అనుకున్నారు.
అలా తమకు దొరికిన థియేటర్స్ లో, కేవలం 99 రూపాయలకు మాత్రమే టికెట్ రేట్స్ పెట్టి, ఈ చిత్రాన్ని విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. మొదటి రోజు కోటి 11 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండవ రోజు ఇంకా బెటర్ ట్రెండ్ ని చూపెడుతూ, 1 కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల 41 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఒక భారీ సినిమాకు పోటీగా నిలబడి ఇంత మాత్రం గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా సైలెంట్ గా వచ్చి, బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దగ్గరగా ఈ సినిమా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రన్ ఉంటుందో చూడాలి.’అఖండ 2’ చిత్రానికి డివైడ్ టాక్ రావడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ‘అఖండ 2’ కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. పాజిటివ్ టాక్ తో పాటు టికెట్ రేట్స్ కూడా చాలా తక్కవ ఉండడం ఈ సినిమాకు బాగా కలొచ్చింది