Joe Root : 2021 నుంచి రూట్ స్థిరంగా ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో క్యాలెండర్ ఇయర్ లోనూ 1000+ రన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇదే దశలో సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. రూట్ ఇప్పటికే 34 టెస్ట్ సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికే రూట్.. కుక్ రికార్డును అధిగమించాడు.. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ జుట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ముల్తాన్ టెస్టులో పాకిస్తాన్ జట్టుపై బ్రూక్ తో కలిసి 454 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. 2020లో రూట్ తన సగటు 48.00 కంటే తక్కువకి పడిపోయింది. 2018 నుంచి 2020 వరకు అతడు సమర్థవంతమైన ఇన్నింగ్స్ ఆడలేదు.. 60 ఇన్నింగ్స్ లలో కేవలం నాలుగు సంచరిని మాత్రమే చేశాడు. 2021 నుంచి అతడు తన టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ శైలి పూర్తిగా మార్చుకున్నాడు. శ్రీలంక జట్టుతో గాలే మైదానంలో డబుల్ సెంచరీ చేసి ట్రాక్ లోకి వచ్చాడు.. చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో 218 రన్స్ చేశాడు. 2021 నుంచి ఇప్పటివరకు రూట్ 91 ఇన్నింగ్స్ లు ఆడాడు. 18 సెంచరీలు చేశాడు. 2021 ప్రారంభంలో రూట్ 48 కంటే తక్కువ సగటు కలిగి ఉన్నాడు. ప్రస్తుతం 50 మార్క్ అధిగమించాడు. ముల్తాన్ టెస్టులో 262 రన్స్ చేసిన అతడు.. తొలిసారిగా 51.00 ను అధిగమించాడు. గత నాలుగేళ్లలో ప్రతి ఏడాది అతడు 1000కి మించి పరుగులు చేస్తున్నాడు. అయితే అతడి ముందు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నాడు. 6 సార్లు టెస్టులలో ప్రతి ఏడాది 1000 పైగా పరుగులు సాధించాడు. పాంటింగ్, సంగక్కర, హెడెన్, కుక్, లారా, కలిస్ ఐదుసార్లు ఈ ఘనతను అందుకున్నారు..
యూసఫ్ రికార్డుకు చేరువలో..
రూట్ 2024 లో 1,248 రన్స్ చేశాడు. అంతేకాదు ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండు క్రికెటర్ గా అవతరించాడు. మొత్తంగా 13 ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. రూట్ ఇప్పటివరకు 350 మ్యాచ్ లు ఆడాడు. 20,079 రన్స్ చేశాడు. అయితే ప్రస్తుతం యాక్టివ్ ఆటగాళ్లుల్లో విరాట్ కోహ్లీ తర్వాత 20,000 రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడు రూట్ ఒక్కడే. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 535 మ్యాచ్ లు ఆడాడు. 27,041 రన్స్ చేశాడు. రూట్ ఇంకా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. పాకిస్తాన్ జట్టుతో రెండు, న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టులు ఆడనున్నాడు. అతడు తన బ్యాటింగ్ సగటును 65.68గా నమోదు చేస్తే.. సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో మహమ్మద్ యూసఫ్ నెలకొల్పిన 1,788 పరుగుల రికార్డుకు అతడు 540 రన్స్ దూరంలో ఉన్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా తన సమకాలినుల రికార్డులను అధిగమించిన రూట్.. ఇప్పుడు ఆల్ టైం రికార్డులను సృష్టించే పనిలో పడ్డాడు. గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సగటును అతడు.. అదేవిధంగా ఉంచుకోగలిగితే సచిన్ టెండూల్కర్ టెస్టులలో నెలకొల్పిన 15,921 పరుగుల రికార్డును అధిగమించగలడు. ఇందుకు అతడికి 56 ఇన్నింగ్స్ లు అవసరమవుతాయి.
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా?
ప్రస్తుతం 37 సంవత్సరాల రూట్ .. మరో మూడు సంవత్సరాల పాటు స్థిరంగా టెస్ట్ క్రికెట్ ఆడితే సచిన్ రికార్డును అధిగమించగలుగుతాడు.. అయితే వచ్చే మూడు సంవత్సరాలు అతడు అలా ఆడటం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నను క్రికెట్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ జటతో డబుల్ సెంచరీ చేయడం ద్వారా రూటు మరో రికార్డు సృష్టించాడు. ఆసియా ఖండంలో మూడవ టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన విజిటింగ్ బ్యాటర్ గా రూట్ రికార్డు సృష్టించాడు. టెస్టులలో మొత్తంగా ఆరు డబుల్ సెంచరీలు పూర్తి చేశాడు. అతనికంటే ముందు వాలీ హమ్మండ్ 7 డబుల్ సెంచరీలతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.